కనీళ్ళు ఆగడం లేదు…సుధీర్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

సినిమా కోసం ఎంతైనా కష్టపడడానికి ముందుంటాడు హీరో సుధీర్ బాబు. అందుకే డెడికేషన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.కమర్షియల్ సినిమాలు చేసేసి స్టార్ అయిపోవాలి.. మామగారి సినీ బ్యాక్ గ్రౌండ్ వాడుకుని పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చెయ్యాలి అని తహతహలాడడు. అయినాసరే సుధీర్ బాబు కటౌట్ కు తగ్గ సినిమా పడలేదు అని ఇప్పటి వరకూ ఆయన అభిమానులు చాలా ఫీలయ్యారు. ఈ క్రమంలో ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘వి’ చిత్రం సుధీర్ బాబుని ఎంత కమర్షియల్ గా వాడుకోవచ్చో ప్రూవ్ చేసింది.

ఈ చిత్రంలో సుధీర్ పాత్రకు మంచి పేరు దక్కింది. కాగా ఇటీవల సుధీర్ బాబు పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విషయం ఏమిటంటే ..ఇప్పుడు హీరోగా రాణిస్తున్న సుధీర్ బాబు గతంలో స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన బ్యాడ్మింటన్ వదిలి సినిమాల్లోకి వచ్చాడు. ఈ కారణంగా సుధీర్ బాబు తండ్రి… ఆయనతో మాట్లాడటం మానేశాడట.ఇప్పటి వరకూ వారి మధ్య గ్యాప్ ఏర్పడిందని కూడా తెలిపాడు. అయితే తాజాగా ఆయన ‘వి’ సినిమా చూసి… సుధీర్ కు ఫోన్ చేసి మెచ్చుకుంటూ మాట్లాడాడట.

దాంతో సుధీర్ బాబుకు కన్నీళ్లు ఆగలేదట. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా తన సినిమాల గురించి మాట్లాడని సుధీర్ తండ్రి.. సడెన్ గా ఇలా ‘వి’ గురించి స్పందించడంతో భావోద్వేగానికి గురైనట్టు తెలిపాడు సుధీర్ బాబు.ఈరోజు తనకు ఎంతో సాధించాను అనే ఫీలింగ్ కూడా కలిగినట్టు సుధీర్ బాబు తన సంతోషాన్ని వెల్లడించాడు. ‘వి’ చిత్రంలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆదిత్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక సుధీర్ ట్వీట్ కు తన అభిమానులు లైక్ లు రీ ట్వీట్లు కొడుతూ వైరల్ చేస్తున్నారు. ‘వి’ చిత్రం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ఈ ట్వీట్ కు లైక్ కొట్టడం విశేషం.


Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus