సుమన్.. ఇప్పుడంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఇతన్ని తీసిపారేసేవారు ఉన్నారేమో. కానీ అప్పుడు ఇతనొక పెద్ద స్టార్ హీరో. తమిళ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. మరో నటుడు బాను చందర్ సాయంతో టాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. 6 అడుగుల అందగాడు.. అప్పట్లో స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా ఈయన కాల్షీట్ల కోసం ఎదురుచూసేవారు. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ లో ఇతనికి మంచి క్రేజ్ ఉండేది. అలాంటి ఈ స్టార్ హీరోని బ్లూ ఫిలిమ్స్ కేసులో ఇరికించి.. అలాగే గుండా యాక్ట్ కూడా మోపి జైలుకి పంపించారు.
‘టాలీవుడ్లో ఓ స్టార్ హీరో.. అతని ఎదుగుదలకు సుమన్ అడ్డుపడుతున్నాడు అనే ఉద్దేశంతోనే.. ఇతని పై తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపేలా చేశాడని’ ఎప్పటి నుండో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే నేపోటిజం అనే ఇష్యు కూడా రన్ అవుతుంది కాబట్టి.. ఇటీవల సుమన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఈ విషయం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి సుమన్ సమాధానం ఇస్తూ.. “నన్ను బ్లూ ఫిలిమ్స్ కేసులో ఇరికించిన వ్యక్తి పేరు దివాకర్. అతను ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు.అతని సమస్య .. ప్రైవేట్ ఫ్యామిలీ ఎఫైర్ కు సంబంధించింది.
ఈ వివాదంలోకి సినిమా వాళ్లను అనవసరంగా లాగారు.నేను జైలుకు వెళ్తానన్న విషయం నాకు ముందే తెలుసు. అందుకే నా స్నేహితుడు భాను చందర్‌ను కాపాడేందుకు ప్రయత్నించాను. ‘నన్ను కలవద్దు, నాకు ఫోన్ చెయ్యొద్దు’ అని భాను చందర్‌తో కావాలనే చెప్పాను.నేను తెలుగులో బాగా క్లిక్ అవుతాను అని నమ్మిన వ్యక్తి భానునే..! నా వల్ల అతను ఇబ్బందులు పడకూడాదనే ఉద్దేశంతో అలా చెప్పాను.నేను ఇరుక్కున్నా.. నా వల్ల మిగిలిన వారికి ఇబ్బంది తలెత్తకూడదని ఆ టైములో అనిపించింది. ఆ రోజు జరిగిన దానికి పూర్తి కారణం అప్పటి నా మిత్రుడు దివాకరే. అతని గురించి నేను ఎప్పుడో చెప్పాను. కానీ అనవసరంగా కొంతమంది హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆ రోజు జరిగినదానికి.. ఏ హీరోతోనూ సంబంధం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు సుమన్.