సీనియర్ నటుడు మరియు ఒకప్పటి స్టార్ హీరో అయిన సుమన్ గొప్ప మనసు చాటుకున్నాడు.ఆయన ఇండియన్ ఆర్మీ కి 117 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్య క్షేత్రానికి అతి సమీపంలోని ఉన్న తన భూమిని సుమన్ దానం చేశాడు. భారత దేశ సైనిక దళాల పై అతనికి గల ప్రేమని ఈ విధంగా చాటుకున్నాడు సుమన్.
ఇండియన్ ఆర్మీ ఆవిధంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా బోర్డర్ లో కాపలా కాయడం వలనే మనం ఇక్కడ సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నాం అంటూ సుమన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నిజానికి కార్గిల్ వార్ టైంలో అంటే 28 ఏళ్ళ క్రితమే సుమన్ ఇండియన్ ఆర్మీకి ఈ భూమిని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో ఈ విషయం పై మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఈ 117 ఎకరాల భూమి లిటికేషన్ లో కూడా పడింది.
కోర్టులో దీని పై కేసు కూడా నడిచింది. అయితే ఇంతకాలానికి ఆ విషయం పై సుమన్ కు అనుకూలంగా తీర్పు వచ్చిందేమో… ఇక ఆలస్యం చేయకుండా ముందుగా ప్రకటించినట్టు సుమన్ కానిచ్చేశారు. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమన్ సినిమాల్లో రాణిస్తున్నారు.