ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా ఏప్రిల్ 28వ తేదీ విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రజనీకాంత్ పై వైఎస్ఆర్సిపి నేతలు తీవ్రమైన కామెంట్ చేస్తూ విమర్శలు చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి రజనీకాంత్ ఎక్కడ ప్రస్తావించలేదు. ఇలా రజనీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వల్ల తాను స్ఫూర్తి పొందిన విధానాన్ని తెలియజేశారు.
అలాగే హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని ఆయన విజన్ చాలా పెద్దదంటూ చంద్రబాబు గురించి ప్రశంసలు కురిపించారు. అయితే ఇది నచ్చని వైసిపి నేతలు పెద్ద ఎత్తున రజనీకాంత్ పై విమర్శలు చేశారు. ఇలా రజిని పై అనవసరమైన విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు వైఎస్ఆర్సిపి నేతలు రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.
ఇలా ఈ వివాదం కొద్ది రోజులు పాటు చలరేగిన చివరికి ముగిసింది కానీ తాజాగా (Suman) నటుడు సుమన్ మరోసారి ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ఆరోజు రజనీకాంత్ మాట్లాడినటువంటి మాటలలో ఆయన స్పీచ్ లో ఏమాత్రం తప్పులేదని తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారా అన్న విషయం వాస్తవమేనని తెలిపారు.
రాజకీయాలు అన్న తర్వాత ఎత్తు పళ్లాలు ఉండడం సర్వసాధారణం. ఒకరు వస్తుంటారు ఒకరు పోతుంటారు అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు టైం బాగాలేదని… ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే చేసింది కూడా చేయలేదు అని చెప్పడం భావ్యం కాదని సుమన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?