సుబ్రహ్మణ్యపురం, ఇదమ్ జగత్ సినిమాల తర్వాత సుమంత్ చేస్తున్న సినిమా కపటధారి. ఈసినిమాని ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 19వ తేదిన ప్రేక్షకుల ముందుకురాబోతోంది ఈ సినిమా. కన్నడలో మంచి విజయాన్ని సాధించిన కవలధారి సినిమాకి ఇది రీమేక్. ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక హత్యకేసులో ఇరుక్కుని దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. నందితశ్వేత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే, ఈసినిమా ఒరిజినల్ లో ఎలా ఉందో అలాగే తీయలేదని, ఎన్నో మార్పులు చేర్పులు చేశామని చెప్తోంది చిత్రయూనిట్. అంతేకాదు, సుమంత్ ఇంటర్య్వూలో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఒక ప్రముఖ మ్యాగ్జైన్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఈసినిమా గురించి ఆసక్తికరమైన విషయాలని చెప్పాడు. ఈ సినిమా ఒక న్యూ జోనర్ లో ఉండే థ్రిల్లర్ మూవీ అని, కన్నడలో స్లో న్యారేషన్ ఉంటే తెలుగులో మేము దాన్ని స్పీడ్ గా చేశామని చెప్పాడు. ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ సినిమాలకంటే ఇది చాలా భిన్నమైన సినిమా. ఇది క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది.
ఇందులో ట్విస్ట్ లు సస్పెన్స్ లు ప్రేక్షకులకి మంచి అనుభూతినిస్తాయని చెప్పాడు సుమంత్.40 సంవత్సరాల క్రితం కేసుని తిరగతోడి మళ్లీ దాని ఆధారాలని చేజిక్కుంచుకునే నేపధ్యంలో పోలీస్ కి ఎదురయిన సవాళ్లు, వచ్చిన సందేహాలు చాలా ఆసక్తిగా ఉంటాయట. పై ఆఫీసర్లు ఎం త చెప్తున్నా కూడా హీరో వినకుండా కేస్ ని సాల్వ్ చేయడమనేది సినిమా కథలో మంచి థ్రిల్ ని ఇస్తుందని అంటున్నాడు ఈ హీరో. ఒరిజినల్ కంటే కూడా తెలుగులోనే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి సక్సెస్ ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదీ విషయం.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?