Suriya: క్రికెట్‌లోకి మరో స్టార్‌ హీరో… చరణ్‌ ఇప్పటికే వచ్చేశాడుగా!

  • December 28, 2023 / 02:38 PM IST

స్ట్రీట్‌ టు స్టేడియం అంటూ… దేశంలో ఓ కొత్త క్రికెట్‌ టోర్నీ మొదలవ్వబోతోంది. వీధుల్లో ఔత్సాహిక క్రికెటర్లను ఎంపిక చేసుకుని వాళ్లతో ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL) ఆడించాలి అనేది యాజమాన్యం ఆలోచన. దీని కోసం ఒక్కొక్కరుగా సినిమా సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ముఖ్య నగరాల పేర్లతో జట్లను ఏర్పాటు చేస్తూ వాటి యజమానులుగా మారుతున్నారు. అలా హీరో సూర్య ఓ జట్టు యజమాని అయ్యాడు. ఐఎస్‌పీల్‌లో చెన్నై జట్టును హీరో సూర్య కొనుగోలు చేశారు అంటూ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది.

‘క్రికెట్‌ ఔత్సాహికులు అంతా కలసి క్రీడా స్ఫూర్తిని కొనసాగిద్దాం. తమిళనాడు టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని సూర్య తన సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. ఈ టీమ్‌లో భాగం కావాలనుకున్న క్రీడాకారుల కోసం ఓ వెబ్‌ సైట్‌ లింక్‌ను కూడా షేర్‌ చేశారు. ఇప్పటికే ఈ లీగ్‌లోకి మరికొంతమంది స్టార్‌ హీరోలు వచ్చి సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ జట్టును మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

జమ్ము కశ్మీర్‌కు చెందిన శ్రీనగర్‌ జట్టును అక్షయ్‌ కుమార్‌ తీసుకున్నారు. ముంబయి జట్టును సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కొనుగోలు చేయగా, బెంగళూరు ఫ్రాంచైజీని హృతిక్‌ రోషన్‌ కైవసం చేసుకున్నాడు. ఇంకా మరికొంతమంది స్టార్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. త్వరలోనే వాళ్ల వివరాలు వెల్లడిస్తారట. ఐఎస్‌పీఎల్‌లో టీ 10 క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఈ టోర్నీ ఉంటుంది.

ఇందులో రబ్బర్‌ బంతి / టెన్నిస్‌ బంతితో క్రికెట్‌ ఆడతారట. ఇటీవల ఈ టోర్నీకి సంబంధించిన పరిచయ కార్యక్రమం జరిగింది. అయితే ఐపీఎల్‌లో చరణ్‌ ఓ జట్టును కొనుగోలు చేస్తాడని వార్తలు ఆ మధ్య వచ్చాయి. అయితే ఇప్పుడు ఐఎస్‌పీఎల్‌లో కొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా కొంటాడేమో చూడాలి. ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌లో కొత్త జట్టు యాడ్‌ అయ్యే పరిస్థితి లేదు. వచ్చినప్పుడు కచ్చితంగా చరణ్‌ ఈ పని చేస్తాడు అని అంటున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus