టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి క్రేజ్ అందుకున్న వారిలో తరుణ్ ఒకరు. బాలనటుడిగా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న తరుణ్ 2000వ సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో ఒక్కరోజులోనే తరుణ్ ఇంటిముందు అగ్ర నిర్మాతల మేనేజర్లు క్యూ కట్టారు. తరుణ్ డేట్స్ ఇస్తే చాలు సింగిల్ సిట్టింగ్ లో అడిగినంత ఇచ్చి సినిమాలు నిర్మించేవారు.
అంతటి వైభవాన్ని చూసిన తరుణ్ స్టార్ హోదాను ఎక్కువ రోజులు అనుభవించలేకపోయాడు. అతని స్టోరీ సెలక్షన్ కూడా కెరీర్ ను దెబ్బ కొట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన నువ్వే నువ్వే తరువాత ఎన్నో సినిమాలు చేసినా ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు. అయితే ఒకనొక సమయంలో అతను మంచి హిట్టు సినిమాను మిస్ చేసుకున్నాడట. అల్లరి నరేష్ నటించిన అహనా పెళ్ళంట సినిమాను మొదట తరుణ్ తోనే చేయాలని అనుకున్నారట.
కానీ తరుణ్ ముందు ఓకే అన్నప్పటికి ఆ తరువాత ఎదో ఆలోచించి రిజెక్ట్ చేశాడట. ఆ చిత్ర దర్శకుడు వీరభద్రం చౌదరి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పాడు. ఆ సినిమా అల్లరి నరేష్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. 100రోజులు కూడా ఆడింది. బహుశా తరుణ్ ప్లాప్స్ ఎదుర్కొంటున సమయంలో ఆ సినిమా చేసి ఉంటే మరోలా ఉండేదేమో…