Upendra: ఆసుపత్రిలో ఉపేంద్ర.. ఆందోళనలో కన్నడ పరిశ్రమ..!

సినీ పరిశ్రమను వరుసగా జరుగుతున్న హఠాత్ పరిణామాలు షాక్‌కి గురిచేస్తున్నాయి.. ఇటీవల పలు భాషలకు చెందిన సినీ ప్రముఖుల మరణాలను గురించిన వార్తలనుండి ఇంకా తేరుకోకముందే ఊహించని విషయాలతో ఉలిక్కి పడుతున్నాయి పరిశ్రమ వర్గాలు.. సీనియర్ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే హాస్పిటల్లో చేరారనే వార్త మర్చిపోకముందే విశ్వనటుడు కమల్ హాసన్ కూడా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి షాక్ అయ్యారు.

ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది.. ప్రముఖ నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు ఉపేంద్ర రీసెంట్‌గా ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఉపేంద్రను మూవీ టీం హాస్పిటల్లో చేర్చారు. ఉపేంద్ర షూటింగ్‌లో ఉన్నట్టుండి కుప్ప కూలిపోయారు. దీంతో ఆయనకు ఏం జరిగిందోనని శాండల్ వుడ్ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఉపేంద్ర, సడెన్‌గా సెట్‌లో కుప్పకూలిపోయారు. ఆయన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని.. ఊపిరి ఆడకపోవడం వల్లే ఇలా జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే ఇది జరిగిన వెంటనే చిత్రబృందం ఉపేంద్రను ఆస్పత్రికి తరలించారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని తెలుస్తోంది..

ఉపేంద్ర కన్నడ నాట నటుడిగా, దర్శకుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించారు. ‘ఏ’, ‘ఉపేంద్ర’, ‘ఓం’, ‘రక్తకన్నీరు’, ‘సూపర్’ లాంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి ట్రెండ్ సెట్ చేశారు. ఆయన సినిమాల్లో ఆయన మాత్రమే నటించగలడు.. ఆయన మాత్రమే డైరెక్ట్ చేయగలడు…అలాంటి డిఫరెంట్ ఐడియాలు ఆయనకే సాధ్యం అనేంతలా ప్రభావం చూపాయి ఆ చిత్రాలు.. కన్నడ ఇండస్ట్రీ పదేళ్ల పాటు ఉపేంద్రను బ్యాన్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు.

ఉపేంద్ర రావుని కన్నడలో రియల్ స్టార్ అంటారు. తెలుగులోనూ ‘కన్యాదానం’, ‘ఒకేమాట’, ‘రా’, ‘టాస్’ లాంటి పలు చిత్రాలు చేశారు. కొంత గ్యాప్ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గని’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. యాక్టర్, రైటర్, డైరెక్టర్, సింగర్‌గానూ సత్తా చాటిన ఉపేంద్ర ప్రస్తుతం ‘కబ్జా’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus