ఇప్పుడంటే ఆటిట్యూడ్, బోల్డ్ యాక్టింగ్ కు విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ డెఫినిషన్ అని చెబుతున్నారు కానీ… ఆటిట్యూడ్ అండ్ బోల్డ్ యాక్టింగ్ కు ‘కేర్ ఆఫ్ అడ్రెస్’ అంటే ఉపేంద్రనే గుర్తుకొస్తాడు. రెగ్యులర్ సినిమాలు కాకుండా కాస్త బోల్డ్ గా ఉన్న సినిమాలనే చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు ఉపేంద్ర. అవి కొంతమందికి వెర్రిగా కనిపిస్తుంది కానీ… కొన్ని సినిమాల్లో ఉపేంద్ర చెప్పిన డైలాగులు అన్నీ నిజాలే అని ప్రశంసలు కురిపించేవారు కూడా ఉన్నారు. ఇక హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా 9 సినిమాలు తెరకెక్కించాడు ఉపేంద్ర.
తాజాగా ఉపేంద్ర… సౌత్ లో స్టార్ డైరెక్టర్లు అయిన రాజమౌళి, శంకర్ లనే వెనక్కి నెట్టేశాడట. వరల్డ్ టాప్ 20 డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించుకోవడం విశేషం. అసలు విషయం ఏమిటంటే… ప్రముఖ ‘బీ.ఎం.డీ.బీ’ సంస్థ తాజాగా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను ఎంపిక చేసింది. ఆ జాబితాలో సౌత్ నుండీ ఒక్క ఉపేంద్ర పేరుని మాత్రమే ఎంపిక చేసింది. 50మంది దర్శకులను ఈ సంస్థ ఎంపిక చేయగా అందులో ఉపేంద్ర 17వ స్థానం దక్కించుకున్నాడు. ఈ సంస్థ ఎంపిక చేసిన దర్శకుల లిస్ట్ లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీకి రెండో స్థానం దక్కగా.. బాలీవుడ్ పాతతరం దర్శకుడు సత్యజిత్ రే కి నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నాడు. చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ ఉపేంద్రను మాత్రమే ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కేవలం వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకులను మాత్రమే ఈ సంస్థ ఎంపిక చేసినట్టు స్పష్టమవుతుంది.