తెలుగుతోపాటు పరాయి భాషల్లోనూ మార్కెట్ సంపాదించుకోవాలనేది ప్రతి ఒక్క హీరోకి ఉండే కల. అందుకోసం ప్రయత్నించని హీరో లేడు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర కథానాయకులతోపాటు రామ్ చరణ్, రానా, పవన్ కళ్యాణ్ లు కూడా ఈ పాన్ ఇండియన్ ఇమేజ్ కోసం ప్రయత్నించి చేతులు కాల్చుకున్నవారే. అయితే.. సీనియర్ హీరోయిన్స్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు బాలీవుడ్ లో హీరోలుగా నిలదొక్కుకునే ప్రయత్నంలో విఫలమైనప్పటికీ.. ఆ పరాజయాలను ఎవరు పట్టించుకోలేదు.
కానీ.. సోషల్ మీడియా ప్రపంచంలో చిన్నపాటి ఫెయిల్యూర్ కూడా పెద్దగా ప్రాజెక్ట్ చేయడం జరిగి చరణ్ “తుఫాన్”, పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” ల డిజాస్టర్ లను భీభత్సంగా డీగ్రేడ్ చేయడం జరిగింది. అందుకే.. ప్రభాస్ తర్వాత ఒక్క యష్ కి తప్ప ఎవరికీ ఈ పాన్ ఇండియన్ రిలీజ్ అనేది వర్కవుటవ్వలేదు. చిరంజీవి సైరా నరసింహారెడ్డి కూడా అలాగే ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు విజయ్ మొట్టమొదటిసారిగా తన సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
విజయ్ ఇప్పటివరకు తన సినిమాను తెలుగులో కూడా సైమల్టేనియస్ రిలీజ్ దక్కలేదు. అలాంటిది “మాస్టర్”తో పాన్ ఇండియన్ రిలీజ్ కి ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశం అయ్యింది. సంక్రాంతికి వేరే భాషల నుంచి ఎలాగూ పెద్ద సినిమాలు లేవు కాబట్టి మాస్టర్ కి మంచి థియేటర్స్ దొరకడం అనేది సహజం. మరి ఆ స్పేస్ ను విజయ్ సరిగా వినియోగించుకోగలుగుతాడా లేక తోక ముడుస్తాడా అనేది చూడాలి. లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!