Vishal: ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి.. విశాల్ క్లారిటీ!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన సినిమాలతో పాటు నడిగర్ సంఘంకి సంబంధించిన విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. యూత్ లో విశాల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లక్రితం విశాల్ మక్కల్ నల ఇయక్కం అనే ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు ఈ హీరో. ఈ సంస్థ తరఫున భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ట్రస్ట్ ను అతడి అభిమానులు నడిపిస్తున్నారు.

నవంబర్ 6న ఈ సంస్థ తరఫున మొత్తం పదకొండు మంది పేద జంటలకు పెళ్లి జరిపించారు. మథూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విశాల్ పాల్గొన్నారు. పెళ్లి ఖర్చులన్నీ తనే చూసుకున్నారు. తాళిబొట్టుతో పాటు 51 వస్తువులను అందించారు. ఈ కార్యక్రమం తరువాత అతడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతున్నామని.. మూడేళ్లలో దాని నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

ఆ భవన నిర్మాణం పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటానని.. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం బయటపెట్టలేదు. ఇదివరకు విశాల్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించిన అనీషారెడ్డితో విశాల్ చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి కూడా రెడీ అయింది ఈ జంట.

అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. దానికి కారణాలు మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం విశాల్ ‘లాఠీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు అతడి చేస్తిలో రెండు, మూడు సినిమాలున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus