టాలీవుడ్‌లో మరో లవ్ ట్రయాంగిల్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ హీరో ధర్మ మహేష్, నటి రీతూ చౌదరి మధ్య ఏదో నడుస్తోందన్న అనుమానంతో ఆయన భార్య గౌతమి ఏకంగా పోలీసులనే ఆశ్రయించింది. అర్ధరాత్రి మా ఇంటికొచ్చి నా భర్తను బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా తన దగ్గర ఉందని చెప్పడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.నటి రీతూ చౌదరి తనను వేధిస్తోందని, బ్లాక్‌మెయిల్ చేస్తోందని హీరో ధర్మ మహేష్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
అయితే ఈ గొడవలోకి మహేష్ భార్య గౌతమి ఎంటర్ అవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇది కేవలం వేధింపుల కేసు కాదు, నా కాపురంలో నిప్పులు పోస్తున్న ఇష్యూ అంటూ ఆమె ఫైర్ అయింది.ఈ గొడవపై హీరో మహేష్ మాట్లాడుతూ, “నా భార్యకు రీతూ గురించి అనుమానం వచ్చినప్పుడు, ‘ఆమెది ఒక ముచ్చు ముఖం (మంకీ ఫేస్), అలాంటి వాళ్లతో నాకేంటి పని’ అని సర్ది చెప్పాను. కానీ తను నన్ను టార్చర్ పెడుతూనే ఉంది’ అని చెప్పాడు.
ఫ్రెండ్‌షిప్‌ను అడ్డం పెట్టుకుని రీతూ తనను ఇబ్బంది పెడుతోందని ఆరోపించాడు.మహేష్ భార్య గౌతమి మాత్రం అస్సలు తగ్గట్లేదు. “అర్ధరాత్రి పూట నా భర్త షూటింగ్ స్పాట్‌కి, మా ఇంటికి ఎందుకు వస్తోంది? వాళ్ల బెడ్‌రూమ్‌లో ఏం జరుగుతోందో కూడా నా దగ్గర వీడియోలున్నాయి. దాని వాట్సాప్ చాట్ బయటపెడితే.. ఇంకా ఎంతమంది హీరోల ఇళ్లల్లో దూరిందో తెలుస్తుంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనేది పోలీసుల ఎంక్వయిరీలో తేలాల్సి ఉంది.