పాన్ ఇండియా స్టార్ సింప్లిసిటీకి సలాం కొట్టాల్సిందే!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే సిద్ధాంతాలను అతి తక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. సినిమా స్టార్స్ ఇలాంటి వాటిని ఫాలో అవుతారు అని ఊహించలేము. కానీ ఫాలో అయ్యే స్టార్స్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ చాలా సింపుల్ గా ఉంటారు. ‘ఇదేమిటండీ.. ఇంత సింపుల్ గా ఉంటున్నారు’ అని రజనీకాంత్ లాంటి వాళ్లను అడిగితే.. ‘ నాకు నిజజీవితంలో నటించడానికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వడం లేదు.

బయట నాకు సాధారణ జీవితాన్ని గడపడమే సంతృప్తికరంగా ఉంటుంది ‘ అంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. వీరి బాటలోనే మరో వెయ్యి కోట్ల హీరో కూడా చెడిపోయాడు. అతను మరెవరో కాదు కేజీఎఫ్ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్, కేజీఎఫ్2 చిత్రాలతో అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కేజీఎఫ్2 చిత్రం అయితే రూ.1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

ఆ ఒక్క ప్రాజెక్టుతో యష్ మార్కెట్ కూడా పెరిగింది.రూ.50 కోట్ల వరకు అతని పారితోషికం రేంజ్ పెరిగింది. అలాంటి వ్యక్తి ఒక కిరానా కొట్టులో ఏదో కొనుగోలు చేస్తూ చాలా సింపుల్ గా కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. తన కూతురు కోసం ఒక చాక్లెట్ కొనడానికి యష్ ఇలా ఒక కిరానా కొట్టుకు వెళ్లడట.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags