Yash: మంచి సినిమాని కలెక్షన్లతో పోల్చి తక్కువ చేయకండి : యష్

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను దక్కించుకున్నాడు యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అనూహ్యంగా సౌత్ లాంగ్వేజెస్ అన్నిటిలో సూపర్ హిట్ అయ్యింది. దాంతో చాప్టర్ 2 పై భారీ హైప్ నెలకొంది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ‘బాహుబలి2’ ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సౌత్ మూవీగా రికార్డులకెక్కింది.

Click Here To Watch NOW

ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ రన్ ను కొనసాగిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ చిత్రం హీరో యష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల పై సంతోషం వ్యక్తం చేసాడు. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ అన్ని భాషల్లోనూ హిట్ అవ్వడంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ ని చాలా శ్రద్దతో చేసినట్టు చెప్పుకొచ్చాడు. ‘ఈ మూవీ ఇంత భారీ కలెక్షన్లు నమోదు చేస్తుంది అని అనుకోలేదు.

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ కచ్చితంగా జనాలకు నచ్చాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేసాము. ఇక కలెక్షన్లు అనేది వాళ్ళ అప్రిసియేషన్ లా ఫీలవుతున్నాం. ఓ మంచి సినిమాని కలెక్షన్ల నెంబర్లతో పోల్చి చూడడం నాకు నచ్చదు.కొన్ని సినిమాలు హిట్ అయ్యి రూ.10 కోట్లు- రూ.15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తే అవి వేస్ట్ అని కాదు. ఆ మూవీ కంటెంట్ అంతమంది జనాలకు రీచ్ అయ్యింది.. వాళ్లకి తగ్గట్టు వాళ్ళు చేశారు.

‘కె.జి.ఎఫ్ చాప్టర్2′ తర్వాత రాబోయే నా సినిమా రూ.10 కోట్లే కలెక్ట్ చేయవచ్చు. కాకపోతే అది ఎంత మందికి రీచ్ అయ్యింది అనేది మాత్రమే నేను పోల్చి చూసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు యష్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus