Yash: ఇచ్చిన మాటను స్టార్ హీరో యశ్ నిలబెట్టుకుంటారా.. ఏం జరిగిందంటే?

కేజీఎఫ్, కేజీఎఫ్2 సిరీస్ సినిమాలతో భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోలలో యశ్ ఒకరు. ఈ సినిమాల తర్వాత యశ్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే ప్రేక్షకుల ఎదురుచూపులకు తగిన ఫలితం దక్కుతుందని యశ్ తాజాగా కామెంట్లు చేశారు. అభిమానులు గర్వపడేలా చేస్తానని యశ్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నేను రెస్ట్ తీసుకోవడం లేదని నా అభిమానులకు సగం ఉడికించిన ఆహారాన్ని అందించడం నాకు ఇష్టం లేదని యశ్ చెప్పుకొచ్చారు. అభిమానులంతా గర్వపడే సినిమా చేస్తానని కొంచెం ఓపిక పట్టాలని యశ్ కామెంట్లు చేశారు. యశ్ తర్వాత మూవీ ఎవరి డైరెక్షన్ లో తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది. బ్యాగ్రౌండ్ లేని హీరో కావడంతో కొంతమంది స్టార్ డైరెక్టర్లు యశ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నేపథ్యంలో యశ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రావడం కూడా సులువైన విషయం కాదు. యశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియాలో కూడా యశ్ క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్నారు.

యశ్ (Yash) సినిమా అంటే కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాల్సి ఉంటుంది. యశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. యశ్ భవిష్యత్తు సినిమాలతో కేజీఎఫ్2 సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. యశ్ ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags