Balakrishna: బాలయ్యతో రొమాన్స్ కి ఒప్పుకుందట!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు.. హీరోయిన్లను ఫైనల్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. ప్రతీ సినిమాకు ఇదొక సమస్యలా మారింది. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మంది పేర్లను పరిశీలించారు. శృతిహాసన్ పేరు కూడా వినిపించింది. కానీ ఆమె బాలయ్యతో రొమాన్స్ చేసే ఛాన్స్ లేదని అన్నారు.

అయితే గోపీచంద్ మలినేనిపై ఉన్న గౌరవంతో శృతి ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేసిందట. ఈ ఏడాది గోపీచంద్ డైరెక్ట్ చేసిన ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చింది శృతి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో ‘సలార్’ సినిమాలో నటిస్తోంది. తన డేట్స్ బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు.

మైత్రి మూవీస్ లాంటి భారీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండడంతో ‘క్రాక్’ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత బాలయ్య వరుసగా పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయబోతున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus