హీరోయిన్ – డైరక్టర్ కాంబినేషన్… ఇటీవల కాలంలో మనం ఎక్కువగా వింటున్న అంశం. డైరక్టర్‌తో పని చేసే హీరో మారినా, హీరోయిన్ మారడం లేదు. మామూలుగా అయితే ఇది హీరో – హీరోయిన్ మధ్య ఉంటూ వచ్చేది. అయితే దర్శకుల విషయంలోనూ కనిపిస్తోంది. అలా శేఖర్ కమ్ముల కూడా ఓ హీరోయిన్ విషయంలో ఫిక్స్ అయిపోయారా… ఆయన సినిమాలు, అందులో కాస్టింగ్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ‘లవ్ స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల ధనుష్‌తో ఓ ట్రైలింగ్వల్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఏసియన్ సినిమాస్ గ్రూప్ ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీలో నిర్మిస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ పనులు జరుగుతున్నాయట. ఈ క్రమంలో సినిమాలో కథానాయికగా సాయి పల్లవిని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే శేఖర్ కమ్ములతో సాయిపల్లవికి ఇది మూడో సినిమా. తొలుత ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తారని వార్తలొస్తాయి. అయితే ఓవర్ హైప్ వద్దనుకున్నారో లేక మలయాళ, కన్నడలో ధనుష్‌కు మార్కెట్ లేదనుకున్నారో కానీ…
మూడు భాషలకే తేల్చేశారు. తెలుగు, తమిళం ఓకే… హిందీ విషయానికొచ్చేసరికి.. ధనుష్ గతంలో బాలీవుడ్లో చేయడమే కారణం. అయితే అక్కడి జనాల్ని సినిమాకు అట్రాక్ట్ చేయడానికి కొంతమంది బాలీవుడ్ నటుల్ని కూడా సినిమాలోకి తీసుకుంటారని తెలుస్తోంది.