VD12: విజయ్‌ – గౌతమ్‌ సినిమా విషయంలో అప్డేట్‌… షూటింగ్‌ ఎప్పుడంటే?

గౌతమ్‌ తిన్ననూరి – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్‌ అయ్యింది. ఇదిగో ప్రారంభం, అదిగో ప్రారంభం అని టీమ్‌ ఓవైపు చెబుతుంటే… మరోవైపు విజయ్‌ వేరే దర్శకుడితో సినిమా స్టార్ట్‌ చేసేశాడు. దీంతో అసలు ప్రాజెక్ట్‌ ఉందా? లేదా? అనే డౌట్‌ వచ్చింది జనాలకు. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం ఆ ప్రాజెక్ట్‌ ఇంకా ఉంది. అంతేకాదు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే సినిమా స్టార్ట్‌ అవుతుంది అంటున్నారు.

విజయ్‌ దేవరకొండ జోరు మీదున్నాడు. ప్రస్తుతం సరైన విజయం లేకపోయినా… ఏప్రిల్‌ 5న ‘ఫ్యామిలీస్టార్‌’ సినిమాతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించాలని అనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ఇలా పూర్తవుతుందో లేదో అలా కొత్త సినిమా స్టార్ట్‌ చేసేయాలని అనుకుంటున్నాడట. దీని కోసం ఎలాగూ గతంలో ఓకే చేసి హోల్డ్‌లో పెట్టి గౌతమ్‌ తిన్ననూరి సినిమాను ముందుకు తీసుకొస్తున్నాడట. కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్నారంటున్న ఈ సినిమా వచ్చే నెల సెకండాఫ్‌ నుండి మళ్లీ మొదలుపెడతారట.

కొత్త షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం గతంలోనే సన్నాహాలు మొదలు పెట్టింది. కొన్ని ప్రయత్నాలు జరిగాయి కూడా. కానీ ఏప్రిల్‌లో ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌ చేసేలా డేట్స్‌ మొత్తం దానికే ఇచ్చేశాడట. దీంతో ‘వీడీ12’ సినిమాను హోల్డ్‌లో పెట్టారు అంటున్నారు. అయితే ఆ సినిమా అయిపోవడంతో వాయు వేగంతో ఈ సినిమా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. స్పై థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న (VD12) ఈ సినిమాలో విజయ్‌ పోలీసు పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్‌ మారుతుది అంటున్నారు. దీని కోసం త్రిప్తి దిమ్రి, రుక్మిణి వసంత్‌ లాంటి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు రష్మిక మందన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరిని ఓకే చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో తేలితే షూటింగ్‌ ప్రారంభం అంటున్నారు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus