టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ తన 150వ సినిమా చెయ్యాలి అన్న కోరికను సొంత బ్యానర్ లోనే నెరవేర్చుకుంటున్నాడు…అయితే అదే క్రమంలో తన 150వ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలి అన్న ఆలోచనతో ఏదైన డిఫరెంట్ కధతో వస్తాడేమొ అని అందరూ ఆశపడ్డారు…అయితే అలా కాకుండా ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న తమిళ సినిమాని తీసుకుని దాన్ని తెలుగు నేటివీటికి తగ్గట్లుగా మార్పులు చేసి సినిమాను మనముందుకు తీసుకొస్తున్నారు…అయితే అదే క్రమంలో ఈ సినిమా తమిళ్ వర్షన్ కి తెలుగు వర్షన్ కి ఉన్న మార్పుల ప్రకారం చూస్తే కాస్త డిఫరెంట్ గానే ఉంది….ముఖ్యంగా ఈ సినిమాలో కష్టపడి ఎంటర్‌టేన్‌మెంట్ ఇరికించారనే టాక్ బలంగా వినిపిస్తుంది….ఇక తమిళ వర్షన్ కు వస్తే…హీరోయిజానికి ఢోకా ఏమీ లేకున్నప్పటికీ.. సినిమా చూసి బయటికి వచ్చాక ఈ రైతుల సమస్య నేపథ్యంలో వచ్చే సన్నివేశాలే గుర్తుంటాయి.
ఆ సీన్స్ కదిలించేస్తాయి. ఆ ఎపిసోడ్ ను హీరోయిజం.. ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేయకుండా చూడటంలో మురుగదాస్ ప్రతిభ కనిపిస్తుంది. కానీ తెలుగులో అలా కాదు…చేసేది మెగాస్టార్…అందులోనూ మాస్ హీరో ఇక మనకు తగ్గట్టుగా సినిమాను పూర్తిగా మార్చెసాడు మన వినయ్….చిరంజీవి కోసం ఈ సినిమాలో ఇమడని పాటలు.. డ్యాన్సులు యాడ్ చేశారట. అలాగే బ్రహ్మి మీద సెపరేట్ కామెడీ ట్రాక్ కూడా పెట్టారట. మరి అసలే సినిమా సందేశాత్మకంగా ఉండేదు అని అన్నయ్య సదేశం ఇస్తాడని చాలామంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు…ఈ ఎక్స్‌ట్రా వడ్దింపుల వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయ్యీ సినిమా ఫీల్ దెబ్బతింటే సినిమా రిసల్ట్ ఏమవుతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.