బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ పై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈయన గ్రాండ్ ఫినాలే రోజు కప్పు గెలుచుకొని బయటకు రావడంతో అభిమానుల మధ్య గొడవ జరిగి పెద్ద ఎత్తున ఇతరుల కారులను ధ్వంసం చేయడమే కాకుండా ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టడంతో ఈయనపై అలాగే అభిమానులపై జూబ్లీహిల్స్ పోలీసుల కేసు నమోదు చేశారు.ఇలా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో ఆయన తల్లిదండ్రులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్ తల్లిదండ్రులకు హైకోర్టు న్యాయమూర్తి రాజేష్ కుమార్ భరోసా ఇచ్చారు. లాయర్ రాజేష్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రశాంత్ తల్లిదండ్రులు పలు విషయాలను తెలిపారు. పోలీసులు తన కొడుకును అరెస్టు చేస్తారన్న కారణంతోనే తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం తన గెలుపును జీర్ణించుకోలేనటువంటి కొందరు ఈ ఘటనలకు పాల్పడ్డారని ఈమె ఆరోపణలు చేశారు.
అనంతరం లాయర్ మాట్లాడుతూ ఈ విషయంపై నిజాలు తెలియజేయవలసిన బాధ్యత పోలీసులకు ఉందని లాయర్ రాజేష్ తెలిపారు. చట్ట ప్రకారం పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటే మేము అడ్డుకోమని కానీ జూబ్లీహిల్స్ పోలీసులు (Pallavi Prashanth) అతనిపై కేసు నమోదు చేసిన ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రాసి వెబ్ సైట్ లోపొందుపరచలేదని తెలిపారు.
ఈ విషయంలో పోలీసులు కనుక నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్తామంటూ లాయర్ రాజేష్ కుమార్ తెలిపారు. ప్రశాంత్ గెలిచిన ఆనందాన్ని కూడా ఆస్వాదించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయారని అదే విషయమే అందరికీ ఆందోళన కలిగిస్తుందని ఈయన వెల్లడించారు.