Bigg Boss Telugu 6: ఫ్యామిలీ వీక్ లో హైడ్రామా..! ఎమోషనల్ అవుతున్న హౌస్ మేట్స్..! కారణం ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం బిబి కోచింగ్ సెంటర్ టాస్క్ తో పాటుగా హౌస్ మేట్స్ ఫ్యామిలీ పలకరింపులు కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు హౌస్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిరెడ్డి భార్య కవిత, ఇంకా పాప హద్విత వచ్చినపుడు ఆదిరెడ్డితో పాటుగా హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి వాళ్ల పాపతో ఆడుతుంటే రేవంత్ కంటతడి పెట్టాడు.

తన భార్య ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భిణీ కాబట్టి, ఎప్పుడెప్పుడు తను ఫాదర్ అవుతాడా అనే ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఉన్నప్పుడే తన భార్య శ్రీమంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిరెడ్డి పాపని చూసి కంటతడి పెట్టుకున్నాడు. అలాగే రోహిత్ కూడా తన భార్య మెరీనా ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం ఎదురుచూసిందని ఇప్పుడు ఒక్కవారం ఉండి ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. రోహిత్ బాధపడుతుంటే కీర్తి ఓదార్చే ప్రయత్నం చేసింది.

అంతేకాదు, గార్డెన్ ఏరియాలో తిరుగుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటుంటే వచ్చి కీర్తి హగ్ ఇచ్చింది. ఎప్పటి నుంచో కీర్తి రోహిత్ ని అన్నా అన్నా అని పిలుస్తుంది. ఇప్పుడు తన అన్న బాధపడుతుంటే చూడలేకపోయింది. అలాగే, తనకి కూడా పిల్లలు పుట్టరు కాబట్టి ఆదిరెడ్డి పాపని చూస్తూ చాలా సేపు ఆనందపడింది. అంతేకాదు, తన ఫ్యామీలీ గుర్తుకు వచ్చి ఏడుపు ఆపుకుంది. వీరిద్దరి అలా హగ్ చేసుకోవడం అనేది బిగ్ బాస్ ఆడియన్స్ ని కదిలించి వేస్తోంది.

ఎప్పుడూ అమ్మాయి అబ్బాయి హగ్గులు , ముద్దులని నెగిటివ్ గా చూస్తూ ట్రోల్ చేసే బిగ్ బాస్ ప్రేక్షకులు ఇప్పుడు వీరిద్దరి మద్యన హగ్ ని చూసి బాధపడ్డారు. ఒక ఎమోషనల్ రిలేషన్ ఎలా ఉండాలో చూపించిన వీరిద్దరినీ నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఉన్న ఈ హగ్ సీన్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. అలాగే, ఫైమా మదర్ వచ్చి సందడి చేసినపుడు కూడా హౌస్ మేట్స్ అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు.

అప్పుడు కూడా కీర్తి తన ఫ్యామిలీని తలచుకుని బాధపడింది. కీర్తి ఫ్యామిలీ అంతా ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. తను మాత్రం దెబ్బలతో బయటపడి చాలారోజులు కోమాలో ఉండి పోయింది. ఆ తర్వాత తేరుకుని జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus