Waltair Veerayya: మెగాస్టార్ సినిమాలో హైలైట్ ఎపిసోడ్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సినిమాలో రెండు పాటలను చిత్రీకరించడానికి టీమ్ మొత్తం ఫ్రాన్స్ కి వెళ్లనుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి బాస్ పార్టీ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. మొదట్లో ఈ సాంగ్ పై ట్రోల్స్ వచ్చినా.. ఇప్పుడు మాత్రం సాంగ్ జనాల్లోకి బాగా రీచ్ అయింది.

ఈ సినిమాలో రవితేజ కూడా నటించారు. త్వరలోనే రవితేజ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియోను, చిరు-రవితేజలపై చిత్రీకరించిన పాటను రిలీజ్ చేయనున్నారు. ఇవన్నీ డిసెంబర్ రెండో వారంలోపే విడుదల కానున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ బయటకొస్తుండడంతో జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. కథ ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి పోర్టులో దండాలు చేసే లోకల్ మాస్ లీడర్ పాత్ర పోషిస్తున్నారు.

చిరు, రవితేజ మధ్య క్లాష్ జరిగే సన్నివేశాన్ని ఇంటర్వెల్ గా సెట్ చేశారట. ఇద్దరూ ఒకరితో మరొకరు చేసుకునే ఛాలెంజెస్ ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఇచ్చే ఉంటాయని చెబుతున్నారు. సవతి కొడుకుల కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ అయినప్పటికీ.. పాత్రల తీరుతెన్నులు, కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు.

ఈ సినిమా రిలీజ్ కి మరో నెలన్నర సమయం మాత్రమే ఉండడంతో పబ్లిసిటీ విషయంలో జోరు పెంచాలని చూస్తున్నారు. జనవరి మొదటివారంలో హైదరాబాద్ లోనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్, నివేతా పేతురేజ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus