పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో తెరకెక్కిన ‘పింక్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే. అయితే సినిమా మొత్తం లాయర్ కోట్ లో ఉండరట.
కథ ప్రకారం.. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ ‘లా’ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తారు. కాలేజీ లో ఉద్యమ నాయకుడిగా పేరు సంపాదిస్తాడు. జనాలకు సాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఇలా ఎన్ని హీరోయిజం పాయింట్లు యాడ్ చేయొచ్చో అన్నీ చేశారట. ‘సత్యమేవ జయతే’ అంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పాట కూడా సినిమా ఉంది. ఇక హీరోయిన్ తో ప్రేమ, డ్యూయెట్ వంటి అంశాలు కూడా ఉన్నాయి.
హీరోయిన్.. పవన్ కళ్యాణ్ కి చేతి గడియారం గిఫ్ట్ గా ఇస్తుంది. అందుకే పవన్ పదే పదే ఆ వాచీ వంక చూస్తూ ఉంటారు. భార్యకు దూరమైన పవన్ లా ప్రాక్టీస్ వదిలేస్తాడు. కానీ ముగ్గురు అమ్మాయిల కోసం మళ్లీ నల్ల కోటు ధరించి వారికి న్యాయం జరగాలని ప్రయత్నిస్తాడు. మొత్తంగా చూసుకుంటే ‘పింక్’ సినిమాలో లేని చాలా ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో చూసే ఛాన్స్ ఉంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడనిపిస్తుంది. మరి సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి!