భీష్మ సినిమా హిట్ తర్వాత నితిన్ చెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసే చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమా ప్రముఖ రైటర్ యండమూరీ వీరేంధ్రనాధ్ గారి నవల వెన్నెల్లో ఆడపిల్లని తలపిస్తోంది. హీరో చెస్ ప్లేయర్, ఖైదీగా ఉన్నాడు, టెర్రరిస్ట్ అనే ముద్ర కూడా ఉంది.. అసలు కథేంటి.. ఈ హీరో ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 26వ తేదిన విడుదల కాబోతున్న ఈసినిమా ఇప్పుడు సినీ లవర్స్ లో ఆసక్తిని రేపుతోంది.
ఇక ఈసినిమాలో నితిన్ సరసన ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తుంటే, రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా, సంపత్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ చాలా బాగుంటుందని, చెస్ ప్లేయర్ గా నితిన్ అల్లాడిస్తాడని చెప్తోంది మూవీటీమ్. అంతేకాదు, రీసంట్ గా సంపత్ రాజ్ ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ సినిమా గురించి ఆసక్తికమైన విషయాలని చెప్పుకొచ్చాడు. చంద్రశేఖర్ యేలేటి ఎంచుకునే కథల్లో కొత్తదనం ఉంటుందని, స్క్రీన్ ప్లే ముఖ్యంగా చాలాబాగుంటుందని చెప్పాడు. అంతేకాదు, సినిమాలో క్లైమాక్స్ అన్నింటికంటే సూపర్బ్ గా ఉంటుంది. ఎవరైనా సరే సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతారు అంటూ చెప్పాడు. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అంతేకాదు, రీసంట్ గా జూనియర్ ఎన్టీఆర్ సైతం తనకిష్టమైన దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి కూడా ఒకరని, చెక్ మూవీటీమ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పడంతో ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు అందరూ. ఇక సినిమాలో జైల్లో వచ్చే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోతాయట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలన్నీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుందని టాక్. మరి ఈసినిమాతో నితిన్ మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.