‘వకీల్ సాబ్’ ఫస్ట్ రివ్యూ : డైరెక్టర్ ను పక్కన పెట్టేసాడట : బర్త్ డే కాదు డెత్ డే

  • April 7, 2021 / 07:52 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించిన వకీల్ సాబ్ ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తున్న మూవీ కావడంతో వకీల్ సాబ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పింక్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ట్రైలర్ లో భారీగా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అయితే ‘పుష్ప’ అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల ఆరు నెలలు వాయిదా పడిందని టాక్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్ లో ‘పవర్ పేట’ అనే సినిమా తెరకెక్కనున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఛల్ మోహన రంగ’ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ దర్శకుడిపై ఉన్న నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు నితిన్. కృష్ణ చైతన్య చెప్పిన పొలిటికల్ టచ్ ఉన్న ‘పవర్ పేట’ కథ నితిన్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను మూడు భాగాలుగా తీస్తారని అన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వివాదాస్పద కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తరచూ రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నేడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు. కెరీర్ తొలినాళ్లలో మంచి కథ, కథనాలతో కూడిన సినిమాలను తెరకెక్కించిన వర్మ ఆ తర్వాత కాలంలో కథ, కథనాలను పట్టించుకోకుండా సినిమాలు తీస్తూ వచ్చారు. ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో హిస్టరీని క్రియేట్ చేసింది. గతేడాది లాక్ డౌన్ సమయంలో కూడా సినిమాలు తెరకెక్కించి ఆ సినిమాలను ఆర్జీవీ విడుదల చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వకీల్‌సాబ్‌ షాకింగ్‌ ఎలిమెంట్‌ ?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus