కరోనా సెకండ్ వేవ్ తో ఓటీటీ మార్కెట్ కు మరింత బలం చేకూరింది. జనాలు సినిమాల కంటే కూడా ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. స్టార్ క్యాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ బావుంటే వెబ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ దక్కుతోంది. మొన్న వచ్చిన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ – నిన్న వచ్చిన సినిమా బండి మంచి రిజల్ట్ ను అందుకున్నాయి. ఇక అగ్ర దర్శకులు రచయితలు సైతం వెబ్ కంటెంట్ రెడీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆహా యాప్ అందుకోసం ఒక ప్లాన్ కూడా వేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో నటించి మీరా చోప్రా నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు. కరోనా వల్ల ఎంతోమంది సెలబ్రిటీల కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకోగా మీరాచోప్రా ఫ్యామిలీలో సైతం కరోనా వల్ల విషాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన మీరాచోప్రా ఫ్యామిలీలో కేవలం 7 రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సరైన సమయంలో బెడ్ దొరకకపోవడం,మందులు దొరకకపోవడం వల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా గత నెల 29వ తేదీన మీరాచోప్రా కజిన్ సరైన సమయంలో బెడ్ లభించకపోవడంతో ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకు మీరాచోప్రా మరో కజిన్ చనిపోయారు. వరుసగా ఇద్దరు కజిన్స్ చనిపోవడంతో మీరాచోప్రా ఎమోషనల్ కావడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
కరోనా, లాక్ డౌన్ కారణంగా దర్శకులకు పని లేకుండా పోయింది. సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో కొందరు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. మరికొంతమంది తమ స్క్రిప్ట్ లను మెరుగుదిద్దుకుంటున్నారు. అయితే యంగ్ డైరెక్టర్లు మాత్రం ఈ టైమ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీలకు కథలను రాసి.. డబ్బు చేసుకుంటున్నారు. ‘అ!’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఆ తరువాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలను రూపొందించారు.డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు హాట్ స్టార్ కోసం ఓ కథను అందించాడట. ప్రశాంత్ వర్మ అందించిన కథతో హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ రూపొందుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!