అంచనాలు తగ్గించేందుకు జక్కన్న ట్రయల్స్ : పెళ్లికి రెడీగా ఉందట : తారక్ తో ఒక్క ఫోటో కూడా లేదట

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమా విషయంలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడని రాజమౌళి అనుకున్న స్థాయిలో ఔట్ పుట్ వచ్చేవరకు హీరోలను, ఇతర నటీనటులను టార్చర్ చేస్తారని ఇండస్ట్రీలో పేరుంది. అమరశిల్పి జక్కన్నలా సినిమాలను చెక్కుతూ ఉంటారనే కారణం వల్లే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చింది. అయితే నిన్న రిలీజైన భీమ్ పోస్టర్ మాత్రం అంచనాలను అందుకోలేక పోవడంతో జక్కన్నపై తారక్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ పోస్టర్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్ బాగుంటుందనే కామెంట్లు వినిపించాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగు వారికి పరిచయమైంది నటి అవికా గోర్. తెలుగులో ఆమె ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడకి పోతావు చిన్నవాడ’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. అవికా చివరిగా ‘రాజు గారి గది 3’ సినిమాలో కనిపించింది. ఆ తరువాత ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తండ్రి పుట్టినరోజునాడు… కొడుకుతో దిగిన ఫొటో పెట్టి విషెస్‌ ఎవరైనా చెబుతారా? కానీ పూజా హెగ్డే చెప్పింది. కావాలంటే ట్విటర్‌లోకి వెళ్లి నిన్న ఆమె ఏం పోస్ట్‌ చేసిందో చూడండి. అంతేకాదు ఆమె అలా ఈ ఫొటో పెట్టడానికి కారణం కూడా చెప్పింది. దీంతో నెటిజన్లలో నవ్వులు పూస్తున్నాయి. అంతే కాదు ఏంటి.. కనీసం ఎన్టీఆర్‌తో దిగిన ఫొటో ఒక్కడి కూడా లేదా? అని ప్రశ్నలు వేస్తున్నారు. దానికి సమాధానం ఆమె ట్వీట్‌లోనే ఇచ్చేసిందనుకోండి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నాగార్జునకు ఫలితం మీద కన్నా దర్శకుడి పనితనం మీద నమ్మకం ఎక్కువ అంటుంటారు. అందుకే గతంలో ఫ్లాప్‌ సినిమా ఇచ్చినా ఆ దర్శకుడి అవకాశం ఇవ్వడానికి వెనుకాడరు అంటుంటారు. అయితే ఇటీవల కాలంలో నాగ్‌ ఇలాంటి డేర్‌ స్టెప్‌ తీసుకోలేదు. కానీ రాహుల్‌ రవీంద్రన్‌ కోసం ఆ పని చేస్తున్నారని టాక్‌. ‘మన్మథుడు 2’ లాంటి డిజాస్టర్‌ ఇచ్చిన రాహుల్‌కు నాగ్‌ మరో ఛాన్స్‌ ఇస్తున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రాహుల్‌ ఓ సినిమా చేస్తున్నాడట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్‌లో ఒకసారి జోడీ కుదిరి… అది వెండితెర మీద హిట్‌ అయ్యింది అంటే… ఆ జోడీని రిపీట్‌ చేయడానికి మన దర్శకనిర్మాతలు ఆసక్తిచూపిస్తుంటారు. హీరోలు కూడా అంతే. అలా ఇప్పుడు ఓ జోడీ రిపీట్‌ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఆ జోడీ నటించిన తొలి సినిమా ఇంకా విడుదల కాకపోవడం గమనార్హం. ఎవరా జోడీ అనుకుంటున్నారా? ఇంకెవరు రామ్‌చరణ్‌, ఆలియా భట్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తొలిసారి నటిస్తున్న ఈ జోడీని శంకర్ సినిమాలో చూడొచ్చనేది కొత్త వార్త.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus