కాస్ట్లీ కారు కొనుగోలు చేసిన నటి హిమజ..వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్..!

పలు సీరియల్స్ లో నటిస్తూ వచ్చిన హిమజ.. రామ్ హీరోగా తెరకెక్కిన ‘శివమ్’ ‘నేను శైలజ’ వంటి చిత్రాలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘నేను శైలజ’ సినిమాలో ఈమె చేసిన పని మనిషి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.’హీరోయిన్ కంటే కూడా పనిమనిషే అందంగా ఉంది’ అంటూ అప్పట్లో ఈమె గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు నెటిజన్లు. అటు తర్వాత ‘ధృవ’ ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ ‘ఉన్నది ఒకటే జిందగీ’,’నెక్స్ట్ నువ్వే’ ‘వినయ విధేయ రామ’, ‘చిత్రలహరి’, ‘వరుడు కావలెను’ వంటి చిత్రాల్లో నటించి బిజీ ఆర్టిస్ట్ అనిపించుకుంది.

‘బిగ్‌బాస్‌ 3’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఈమె మరింతగా పాపులర్ అయ్యింది. ఈ షోలో డేర్ అండ్ డాషింగ్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది కానీ.. గేమ్ పెద్దగా ఆడలేదు అనే చెప్పాలి. అయితే ఈమె గ్లామర్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయినా ఈమె హద్దులు మీరు గ్లామర్ షో చేసింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల హిమజ కొత్త కారుని కొనుగోలు చేసింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యుల కోసం ఇలా కొత్త కారుని కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది. ‘ హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీని ఇలా సర్ ప్రైజ్ చేయగలిగాను.. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైందని నేను భావిస్తున్నాను’ అంటూ తన కొత్త కారు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.అయితే ఈ కారు ధర ఎంత ఉంటుంది అని? నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. కియా కార్నివాల్‌ పేరు గల ఈ కారు రూ.40 నుండి రూ.50 లక్షలు విలువైనదని తెలుస్తుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus