Himaja: పెళ్లి గురించి అడిగితే ఫ్రీడమ్ కావాలంటున్న హిమజ?

తెలుగు బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హిమజ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే హిమజ నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదో ఒక వీడియోని షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ అంటూ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఇలా నేటిజన్స్ అడిగే ప్రశ్నకు ఈమె సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ ఈమె పెళ్లి గురించి ప్రస్తావించారు. ఆస్క్ మీ సెషన్ లో భాగంగా హిమజక్కా పెళ్లెప్పుడు? పెళ్లి గురించి ప్లానింగ్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.ఈ విధంగా నేటిజన్ పెళ్లి గురించి అడగడంతో హిమజ సమాధానం చెబుతూ తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని, పెళ్లంటేనే ఇంట్రెస్ట్ లేదనే సమాధానం చెప్పేశారు.

నాకు పీస్ ఆఫ్ మైండ్, ఫ్రీడమ్ కావాలని తెల్చి చెప్పారు. పెళ్లి జరిగితే ఫ్రీడమ్ ఉండదని భావించిందో ఏమో కానీ తనకు స్వేచ్ఛ కావాలంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో హిమజ రహస్యంగా ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుందని,

అయితే వీరిద్దరికి మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు కూడా తీసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన హిమజ తనదైన శైలిలో తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.నాక్కూడా చెప్పకుండా నా పెళ్లి చేసేసి విడాకులు కూడా ఇచ్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus