హిమ‌జ ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న `జ` మూవీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్‌

బిగ్‌బాస్ ఫేమ్ హిమ‌జ, ప్ర‌తాప్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‌జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా గోవ‌ర్థ‌న్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ హారర్‌ థ్రిల్ల‌ర్‌ `జ`. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. న‌టి హిమ‌జ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా హాజ‌రై `జ` మూవీ ఫ‌స్ట్‌లుక్, టైటిల్ లోగోను విడుద‌ల‌చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి నిర్మాతలు పిఎల్‌కె రెడ్డి, అప్పిరెడ్డి(జార్జ్‌రెడ్డి), సింగ‌ర్ శివ‌జ్యోతి త‌దిత‌రులు అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..

మ్యాజిక్ డైరెక్ట‌ర్ వెంగి మాట్లాడుతూ – “కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్‌తో మంచి సందేశాత్మ‌క చిత్రంగా `జ` రూపొందుతోంది. ఈ చిత్రంలో నాలుగు డిఫ‌రెంట్ పాట‌లు ఉన్నాయి. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు` అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఉపేంద‌ర్ మాట్లాడుతూ – “నేను డాక్ట‌ర్‌ని. ద‌ర్శ‌కుడు సైదిరెడ్డి చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డం జ‌రిగింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ – నేను ఒక సాధార‌ణ రైతు కుటుంబంలో పుట్టి సినిమా రంగం మీద ప్యాష‌న్‌తో ఇక్క‌డికి వ‌చ్చి `జ` సినిమా ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాను. `జ` అంటే జ‌న్మ లేదా పుట్టుక అని అర్ధం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి క‌థా బ‌లం ఉన్న మూవీ. మా ప్రొడ్యూస‌ర్ గోవ‌ర్ధ‌న్ రెడ్డిగారు నా మీద న‌మ్మ‌కంతో ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించ‌డం జ‌రిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఉపేంద‌ర్‌గారి స‌హ‌కారం మ‌రువ‌లేనిది. మా సినిమాలో స్టార్లు లేకున్నా స్టార్ పెర్‌ఫామెన్స్‌లు ఉన్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల‌చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. మీ అంద‌రి బ్లెసింగ్స్ కావాలి“ అన్నారు.

నిర్మాత గోవ‌ర్ధ‌న్ రెడ్డి కందుకూరి మాట్లాడుతూ – “ ఈ సినిమాలో హిమ‌జ అద్భుతంగా న‌టించింది. ఈ మూవీ ద్వారా ఆమెకు న‌టిగా మ‌రింత మంచి పేరువ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. మా ద‌ర్శ‌కుడు సైదిరెడ్డి నాలుగు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి మంచి స‌బ్జెక్ట్‌తో ఈ సినిమాను ‌‌తెర‌కెక్కించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ వెంగి, ఎడిట‌ర్ ఆనంద్‌ ప‌వ‌న్‌‌ ఆయ‌న‌కు పూర్తి స‌హ‌కారం అందించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌తేదిని ప్ర‌క‌టిస్తాం` అన్నారు.

న‌టి హిమ‌జ మాట్లాడుతూ – “నేను సీరియ‌ల్ షూటింగ్‌లో ఉండ‌గా ద‌ర్శ‌కుడు సైదిరెడ్డి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఈ స‌బ్జెక్ట్ చెప్ప‌డం జ‌రిగంది. ఫుల్ లెంగ్త్ ఫెర్‌ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కావ‌డంతో ఈ సినిమా అంగీక‌రించ‌డం జ‌రిగింది. న‌టిగా న‌న్ను మ‌రో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ గోవ‌ర్ధ‌న్ రెడ్డి గారికి, ద‌ర్శ‌కుడు సైదిరెడ్డి గారికి కృత‌జ్ఞ‌త‌లు. ఆర్టిస్టులు టెక్నీషియ‌న్స్ మంచి స‌పోర్ట్‌నందించారు. నా పుట్టిన‌రోజు నాడు `జ` సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేయ‌డం హ్యాపీగా ఉంది“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌టి హిమ‌జ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేశారు.

Most Recommended Video

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus