జమ్మూ – కాశ్మీర్ లోని పహల్గంలో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ పర్యాటకుల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘోర సంఘటన యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. పాకిస్తాన్ పై ఇండియన్స్ అంతా కోపంతో రగిలిపోతున్నారు. ఏదో ఒక రకంగా వాళ్లకి బుద్ధి చెప్పాలని… ప్రధాన మంత్రి మోడీకి సవాల్ విసిరిన వాళ్ళని విడచిపెట్టకూడదు అని అంతా అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ పర్యాటక ప్రాంతంగా మారింది.
చుట్టూ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. మంచు ఒక పక్క.. మరోపక్క యాపిల్ చెట్లు వంటి వాటితో ఆ ప్రాంతం అతి సుందరమైనదిగా అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు అక్కడ రక్తపాతం ఏరులై పారింది. ఇదిలా ఉంటే.. కశ్మీర్ లో టెర్రర్ అటాక్స్ వంటివి లేవు కాబట్టి.. సినిమా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకుని షూటింగ్లు నిర్వహిస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ ను సినీ ప్రేక్షకులకు చూపిస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా అయితేనేమి, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘ఖుషి’ (Kushi) అయితేనేమి.. అక్కడ చిత్రీకరించినవే.
మే 1న విడుదల కాబోతున్న నాని (Nani) ‘హిట్ 3’ (HIT 3) సినిమాని కూడా కొంత వరకు అక్కడ షూట్ చేశారు. సినిమాలోని అత్యంత కీలకమైన భాగాన్ని అక్కడ చిత్రీకరించినట్టు సమాచారం. దాదాపు అక్కడ 25 రోజుల పాటు షూటింగ్ జరిపారట. ముఖ్యంగా ఉగ్రవాద దాడి జరిగిన పహల్గంలోని టూరిజం స్పాట్లోనే ‘హిట్ 3’ షూటింగ్ జరిగిందట. దీంతో నాని అండ్ టీంని ఈ సంఘటన చాలా బాధ పెట్టింది.
‘అదృష్టం కొద్దీ తమ షూటింగ్ ముందుగా అయిపోయింది’ అంటూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది ‘హిట్ 3’ యూనిట్. ఇక ఇప్పట్లో మరో ఇండియన్ సినిమా షూటింగ్ జమ్మూ- కశ్మీర్లో జరిగే అవకాశం లేదు. జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినా.. ఫిలిం మేకర్స్ ఎవ్వరూ అక్కడ షూటింగ్ చేయడానికి ధైర్యం చేయరు అనే చెప్పాలి.