Konda Polam Movie: ఆ సెంటిమెంట్ ప్రకారం కొండపొలం హిట్టేనా?

వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొండపొలం సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. శుక్రవారం రోజున కొండపొలం సినిమా రిలీజ్ కానుండగా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో రెండో హిట్ ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మగధీర సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా హిట్టేనని కామెంట్లు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మగధీర ఒకటి.

ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు. అల్లు అర్జున్ కీరవాణి కాంబినేషన్ లో వచ్చిన గంగోత్రి సినిమా బ్లాక్ బస్టర్ కాగా చిరంజీవి కీరవాణి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘనవిజయం సాధించాయి. మగధీర చరణ్ కు రెండో సినిమా కాగా వైష్ణవ్ కు కొండపొలం రెండో సినిమా కావడంతో పాటు ఈ రెండు సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. మగధీర ఇండస్ట్రీ హిట్ కావడంతో కొండపొలం ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తుండగా

కొండపొలం ఏ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తొలి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేసిన వైష్ణవ్ రెండో సినిమాతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. సినిమాలు, దర్శకుల ఎంపిక విషయంలో వైష్ణవ్ తేజ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ తో కొండపొలం సినిమా తెరకెక్కగా హిట్ టాక్ వస్తే ఈ సినిమాకు భారీగా లాభాలు వచ్చే ఛాన్స్ ఆయితే ఉంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus