కోవిడ్ మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ చాలా ఇబ్బందులు పడుతోంది. కరోనా కారణంగా చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అలానే సినీ రంగం కూడా ఎఫెక్ట్ అయింది. అయితే ఇండియాలో బాలీవుడ్ తప్ప అన్ని ఇండస్ట్రీలు బాగానే పుంజుకున్నాయి. గత రెండేళ్లలో ఎక్కువగా థియేటర్లు మూతపడి ఉంది నార్త్ లోనే. దీంతో జనాలకు థియేటర్లకు వెళ్లి సినిమా చేసే అలవాటు తగ్గిపోయింది. ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కోవిడ్ బ్రేక్ తరువాత వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ..
ప్రేక్షకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా తప్పితే దేనికీ హిట్ టాక్ రాలేదు. ’83’, ‘రన్ వే 34’, ‘బచ్చన్ పాండే’ లాంటి స్టార్ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం నిల్. అడ్వాన్స్ బుకింగ్స్ లేక, ఓపెనింగ్స్ లేక బాలీవుడ్ పరిస్థితి దారుణంగా మరింది. మరోపక్క సౌత్ సినిమాలు బాలీవుడ్ లో వందల కోట్లు రాబట్టడంతో అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
ఇలాంటి సమయంలో ‘భూల్ భూలయియా-2’ అనే సినిమా విడుదలైంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, టబు లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక బజ్ పెరిగింది. హారర్ కామెడీ కావడంతో ఫన్ ఉంటుందని ఆశించారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఈరోజు విడుదలైన సినిమాకి మంచి టాక్ రావడంతో ఉత్తరాదిన థియేటర్లు జనాలతో కళకళలాడాయి.K
హారర్ కామెడీ అంటే అందులో కథలు పెద్దగా కొత్తగా ఏమీ ఉండవు. కానీ హారర్ ఎలిమెంట్స్ కి, కామెడీకి ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలు సినిమాలు ఆడేస్తాయి. ‘భూల్ భూలయియా-2’ సినిమా విషయంలో అదే జరిగింది. మొత్తాన్ని చాలా కాలం తరువాత బాలీవుడ్ కి ఓ హిట్ వచ్చింది.