సహజంగా ఒక్కొక్ ఇండస్ట్రీకి ఒక్కో లెక్క ఉంటుంది. అంటే ఒక్కో ప్రాంతానికి తగ్గట్టు ఒక్కొరకంగా సినిమాలు వస్తూ ఉంటాయి. అంతెందుకు మన టాలీవుడ్ సినిమాల లెక్కలనే తీసుకుంటే కొందరికి మాస్ సినిమాలు నచ్చుతాయి, కొందరికి క్లాస్ సినిమాలు నచ్చుతాయి. ఇంకొందరికీ కుటుంభ కధా చిత్రాలు…ఇంకో రకం ఉన్నారు అదే….ఎప్పుడూ ఈ రొటీన్ సినిమాలేనా కాస్త డిఫరెంట్ గా డీఫ్ఫేర్ంట్ సార్టీస్ ఉంటే బావుంటుంది అని అనుకునేవారు. ఆయితే అలానే రాష్ట్రాల మధ్య బాషలే కాదు, వారి టేస్ట్ లు సైతం వేరు వేరుగా ఉంటాయి అయి తమిళ తంబీలు రుజువుచేశారు.
విషయం ఏమిటంటే… ఇక్కడ డిజాస్టర్స్ గా మారిపోయిన సినిమాలు అక్కడ అంటే తమిళ్ లో సూపర్ హిట్స్ అవుతూ ఉన్నాయి….ఉదాహరణకి గత ఏడాది ‘ఐ’ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన శంకర్ ఇలాంటి సినిమా తీశాడా ని తిట్టుకున్నారు. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్టే. అక్కడ ఈ సినిమాను బాగా ఆదరించారు. అదే క్రమంలో ఈ ఏడాది కొన్ని నెలల కిందట విజయ్ సినిమా ‘తెరి’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు.
కానీ సినిమాని లైట్ తీసుకున్నారు మన వాళ్ళు. ఇక మన తాజా కబాలి విషయమే తీసుకోండి…మన ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజినీ సినిమా ఇలా కూడా ఉంటుందా అని చెత్త సినిమా అన్నావారే ఎక్కువ, కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా బాగా ఆడింది. ఆడుతూ కూడా ఉంది. రివ్యూలు బాగున్నాయి. కలెక్షన్లూ బాగున్నాయి. ఇలా ఈ సినిమాలే కాదు, గతంలో సైతం చాలా సినిమాలు అలానే ఇక్కడ ఫట్ అయ్యీ…అక్కడ హిట్ అయ్యాయి.