Fauji: ప్రభాస్ – హను.. హాలీవుడ్ కనెక్షన్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas) హీరోగా, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ (Fauji) గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వస్తూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారనే విషయం ఇప్పటికే హైలైట్ అయ్యింది. అయితే, తాజాగా ఈ సినిమాలో ఓ హాలీవుడ్ యాక్టర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Fauji

తాజాగా ఫిల్మ్ వర్గాల నుంచి లీకవుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో రజాకార్లతో సంబంధం ఉన్న ఓ కీలక ఎపిసోడ్ హైలైట్ కానుందట. ఈ సీక్వెన్స్‌లోనే ఒక ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ స్క్రీన్‌పై అడుగుపెట్టనున్నారని టాక్. అందులో ఆయన పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ హాలీవుడ్ యాక్టర్ పాత్ర కోసం గత ఆరు నెలలుగా మేకోవర్ తీసుకుంటున్నారని, ఆయన క్యారెక్టర్ ప్రభాస్ పాత్రతో సన్నివేశాల్లో కీలకంగా సాగుతుందని తెలుస్తోంది.

దర్శకుడు హను రాఘవపూడి, ఈ సీన్ ఎమోషన్, యాక్షన్ పరంగా పెద్దదిగా ప్లాన్ చేశారని, మార్చి నుండి ఈ ఎపిసోడ్ షూట్ మొదలవుతుందని సమాచారం. అలాగే, ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని, అందులో ప్రభాస్ ఓ కొత్త యాంగిల్‌లో కనిపిస్తారట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో మరొక హీరోయిన్ కూడా కనిపించే అవకాశం ఉందని వినిపిస్తోంది.

ఆ హీరోయిన్ పేరు ఇంకా బయటకు రాలేదు కానీ, ఆమె పాత్ర కూడా కీలకమేనని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హాలీవుడ్ యాక్టర్ ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ఈ అప్‌డేట్ ఇస్తారట. ఏదేమైనా, హనుతో ప్రభాస్ చేస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ రోజు రోజుకు మరింత హైప్ క్రియేట్ చేస్తూనే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus