Jr NTR: భారీ రేంజ్ లో యంగ్ టైగర్ మూవీ.. మతిపోగొట్టే విజువల్స్ తో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారనే సంగతి తెలిసిందే. మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ సినిమా ఖర్చు విషయంలో ఎలాంటి నిబంధనలు లేవని తెలుస్తోంది. కొరటాల శివ పూర్తిస్థాయి స్వేచ్ఛతో ఈ సినిమా కోసం పని చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. తారక్30 మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారని తెలుస్తోంది.

యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను ఫిక్స్ చేశారని బోగట్టా. నటన, డైలాగ్స్ తో తెగ మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత తారక్ మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరిగింది. ఎన్టీఆర్30 పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ తరహా కథాంశంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించడం ఇదే తొలిసారి కాగా ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా కోసం జాన్వీ 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను మించి జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతో జాన్వీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం. ఈ సినిమాతో సౌత్ లో కూడా తనకు పాపులారిటీ పెరుగుతుందని జాన్వీ ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సౌత్ సినిమాలకు సంబంధించి జాన్వీ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. తారక్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus