వరుణ్ చిత్రానికి శ్రమిస్తున్న హాలీవుడ్ టెక్నీషియన్స్

  • June 3, 2018 / 09:48 AM IST

తొలి సినిమా ఘాజి తోనే జాతీయ అవార్డు అందుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో జరిగే ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో సాగుతోంది. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా నటించేందుకు అతను ప్రతేకంగా ఖజకిస్థాన్ లో శిక్షణ తీసుకున్నారు. అలాగే ఈ చిత్రంలో నటించనున్న బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైద‌రీ, లావణ్య త్రిపాఠిలు శిక్షణ తీసుకొని షూటింగ్ లో పాల్గొన్నారు. హాలీవుడ్ టెక్నీషయన్స్ ఆధ్వర్యంలో ఈ షూటింగ్ సాగుతోంది. అయితే తాజాగా వరుణ్ తేజ్, అదితిరావు హైద‌రీ లకు సంబంధించి త్రీడీ స్కాన్ ని తీసుకున్నట్టు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి చెప్పారు.

“త్రీడీ స్కాన్ అనేది ఈ సినిమాకి మేము ఉపయోగించడం లేదు. కానీ ముందు జాగ్రత్తగా టెక్నీషయన్స్ ప్రధాన నటీనటులైన వరుణ్ తేజ్, అదితిరావు హైద‌రీ లకు సంబంధించి త్రీడీ స్కాన్ తీసుకున్నారు. షూటింగ్ మొత్తం పూర్తియైన తర్వాత ఏమైనా షాట్స్ మిస్ అయినప్పటికీ.. సెట్ కి ఏమైనా ప్రమాదం జరిగి ఇబ్బంది కలిగినా ఈ స్కాన్ సహాయంతో వారిని సృష్టించి సన్నివేశాలను కంప్లీట్ చేయవచ్చు” అని వివరించారు. అవతార్, రజనీకాంత్ కొచ్చడియాన్ వంటి సినిమాలకు ఈ టెక్నాలజీని వాడారు. ఈసారి వరుణ్ తేజ్ చిత్రానికి వినియోగించబోతున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అహంబ్రహ్మాస్మి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా-రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా కమర్షియల్ సినిమాలకు విభిన్నంగా ఉండనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus