రెండు దశాబ్దాల క్రితం హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది హన్సిక. ఆ తరువాత హిందీలోనే కొన్ని సినిమాల్లో బాల నటిగా కనిపించింది. 2003లో హృతిక్ సినిమాలో చిన్న పాపగా కనిపించిన హన్సిక.. సరిగ్గా నాలుగేళ్లు తిరిగేసరికి ‘దేశముదురు’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన నాలుగేళ్లకే హీరోయిన్ అయిపోవడంతో అందరూ షాకయ్యారు. హన్సిక ఇలా మారడానికి డాక్టర్ అయిన తన తల్లి సాయం తీసుకుందని అప్పట్లో ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవడం వలనే ఆమె యువతిగా ట్రాన్స్‌ఫామ్ అయిందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. హార్మోన్ల ప్రభావంతో హన్సిక శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే అప్పట్లో హన్సిక కానీ.. ఆమె తల్లి కానీ ఈ వార్తల గురించి స్పందించలేదు. అయితే ఇటీవలే సోహైల్ కతూరియా అనే తన స్నేహితుడిని పెళ్లాడింది హన్సిక. ఆ వివాహ వేడుకకు సంబంధించి హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న ‘లవ్ షాదీ డ్రామా’లో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ విషయంపై హన్సిక, ఆమె తల్లి స్పందించారు.
ముందుగా హన్సిక మాట్లాడుతూ.. అప్పట్లో తన గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఒక సెలబ్రిటీ అయినందుకు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని.. తనకు 21 ఏళ్ల వయసున్నప్పుడు అలాంటి చెత్త వార్తలు రాశారని తెలిపింది. తను ఎదగడానికి ఇంజెక్షన్స్ తీసుకున్నట్లు రాసిన వార్తలు తనపై చాలా ప్రభావం చూపించాయని హన్సిక తెలిపింది. నా తల్లే స్వయంగా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చారని రాశారని ఆవేదన వ్యక్తం చేసింది.
తన కూతురికి అప్పట్లో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే తాము టాటా, బిర్లాల కన్నా రిచ్ అయి ఉండాలని, కనీసం మిలియనీర్ అయి ఉండాలని హన్సిక తల్లి తెలిపింది. తాము పంజాబీలమని.. తమ దగ్గర 12 నుంచి 16 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారని చెప్పుకొచ్చింది హన్సిక తల్లి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?