హారర్ థిల్లర్ మూవీ ‘ది మాన్షన్ హౌస్’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాలు రూపొందించడానికే నేటితరం దర్శకనిర్మాతలు మక్కువ చూపుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకొని ఆడియన్స్‌ని థ్రిల్ చేయడమే టార్గెట్‌గా తెర వెనుక శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వైవిద్యభరితమైన కథతో హారర్ థిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ది మాన్షన్ హౌస్’. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

నేడు (మార్చి 1) మహా శివరాత్రి కానుకగా ‘ది మాన్షన్ హౌస్’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. పెద్ద బంగ్లా, ఆ బంగ్లా మీద ఒక లేడీ, ఆకాశంలో ఎగురుతున్నట్లుగా మనుషుల రూపాలు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

తలారి వీరాంజనేయ సమర్పణలో శ్రీ హనుమాన్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ది మాన్షన్ హౌస్’ సినిమాకు BCV సత్య రాఘవేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో సుశీల్ మెహర్, యష్ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..వృందా కృష్ణ ఫీమేల్ లీడ్‌లో కనిపించనున్నారు. కమల్ తేజ నార్ల, షారుఖ్, రాజీవ్ సిద్దార్థ్, రాజ్ రాయల్, శ్రవణ్ భరత్, శామీర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus