Khaleja Re-release: రీ- రిలీజ్ సినిమాకి వారం రోజుల ముందే హౌస్ ఫుల్స్..!

‘అతడు’ (Athadu) వంటి డీసెంట్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram)  కాంబినేషన్లో ‘ఖలేజా’ (Khaleja)  అనే సినిమా వచ్చింది. ‘అతిథి’ (Athidhi) తర్వాత దాదాపు 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మహేష్ బాబు చేసిన సినిమా ఇది. 2010 అక్టోబర్ 7న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతోనే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అభిమానులే సినిమాని తిట్టిపోశారు. మహేష్ బాబు చేయాల్సిన సినిమానా అని తెగ తిట్టారు.

Khaleja Re-release:

ఇప్పుడైతే ‘ఖలేజా’ ఓ క్లాసిక్ అని, మహేష్ బాబు ఈ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేశాడని యాంటీ ఫ్యాన్స్ కూడా చెబుతారు. ఏదేమైనా థియేటర్లలో ‘ఖలేజా’ సినిమా పెద్ద డిజాస్టర్. కానీ కంటెంట్ బ్యాడ్ అనడం అన్ని విధాలా కరెక్ట్ కాదు. ఆ టైంలో ఈ సినిమాకి సరైన ప్రమోషన్ జరగలేదు. ‘పోకిరి’ (Pokiri) తర్వాత మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ ఏర్పడింది. కాబట్టి మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వల్లనే ‘సైనికుడు’ ‘అతిథి’ డిజాస్టర్స్ అయ్యాయి.

‘ఖలేజా’ లో ఆ ఎలిమెంట్స్ ఉన్నా.. సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల ఆడియన్స్ కి అవి కనెక్ట్ అవ్వలేదు. ‘ఖలేజా’ అనే టైటిల్ పెట్టుకుని హీరోని మాస్ గా చూపించకుండా ‘దేవుడు.. అనడం ఏంటి?’ అంటూ చాలా మంది పెదవి విరిచారు. కానీ ‘దైవం మనుష్య రూపేణ’ అనే సిద్ధాంతాన్ని త్రివిక్రమ్ చెప్పిన తీరు కొత్తగా ఉంటుంది. అందుకే మొదటిసారి చూసినప్పుడు ఆడియన్స్ కు అది రుచించలేదు. ఇంట్లో కూర్చుని టీవీల్లో చూసినప్పుడు అది కొత్తగా అనిపించింది. సో దీన్ని బట్టి ‘ఖలేజా’ కి దక్కాల్సిన గౌరవం దక్కలేదు.

అయితే మరో వారంలో అంటే అంటే మే 30న ఈ సినిమా రీ- రిలీజ్ అవుతుంది. ఈసారి మాత్రం ఈ సినిమాకి దక్కాల్సిన గౌరవం దక్కేలానే కనిపిస్తుంది. అభిమానులు ఈ సినిమాని ఎగబడి చూసేలా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని రీ- రిలీజ్ చేస్తుండటం విశేషం. ఓ రీ రిలీజ్ సినిమాకి వారం రోజుల ముందు అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. కనుక కచ్చితంగా రీ రిలీజ్లో మాత్రం ‘ఖలేజా’ అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus