Revanth: ఫ్రస్టేట్ అవుతున్న రేవంత్..! క్లాస్ పీకుతున్న హౌస్ మేట్స్..! తప్పెవరిది..?

బిగ్ బాస్ హౌస్ లో మొదటివారం నామినేషన్స్ తర్వాత హౌస్ వేడెక్కిపోయింది. ఎవరికి వారే రీజన్స్ చెప్తూ రెచ్చిపోయారు. ముఖ్యంగా గీతు నామినేషన్స్ అప్పుడు చంటితో మాట్లాడాలని అనుకుంది. కానీ, నామినేషన్స లో అలసిపోయిన పార్టిసిపెంట్స్ గీతు మాటలు వినే పరిస్థితిలో లేరు. ఇదే విషయాన్ని చెప్పారు. తర్వాత గీతుకి చంటికి సాలిడ్ గా పడింది. తర్వాత బాలాదిత్య ఇంకా ఇనయ ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు. ఇక్కడే ఇనయా సుల్తానా కంప్లీట్ గా మిస్ అండర్ స్టాండ్ చేస్కుంది. బాలాదిత్య కూడా సాఫ్ట్ గా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

ఇక ఈ ఇష్యూ తర్వాత పెద్ద ఇష్యూనే జరిగింది. హాట్ స్టార్ టాస్క్ వచ్చినపుడు బజర్ కొట్టేందుకు వెళ్తానన్న ఆరోహికి రేవంత్ సలహాలు ఇచ్చాడు. స్పీడ్ గా ఉండాలి, బజర్ కొట్టాలి, యాక్టివ్ గా ఉండాలి, క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలి అంటూ సలహాలు ఇచ్చాడు. ఇది ఆరోహికి నచ్చలేదు. నేను వెళ్లను అన్నది. దీంతో రేవంత్ మళ్లీ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ పంపించాడు. కానీ, గేమ్ లో ఓడిపోయింది ఆరోహి. దీంతో అందుకే ముందే చెప్పాను యాక్టీవ్ ఉండాలని అంటూ మాట్లాడాడు రేవంత్.

కాన్ఫిడెంట్ తక్కువగా ఉందని చెప్తుంటే, ఆరోహి అపార్ధం చేస్కుని డిఫీట్ అంటే బాగోదు అంటూ వేలు చూపించి మాట్లాడింది. వేలు చూపించకు అంటే, వేలు కాదు ఏదైనా చూపిస్తా అంటూ రెచ్చిపోియంది. దీంతో రేవంత్ మరోసారి ట్రిగ్గర్ అయిపోయాడు. ఆరోహికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. ఇద్దరూ మాటకి మాట అనుకున్నారు. ఆర్జే సూర్య మధ్యలో ఇద్దరికీ సర్ధిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇక రేవంత్ అందరితో మాటలు పడటానికి రాలేదని, బిగ్ బాస్ నన్ను ఈవారం పంపించేసినా హ్యాపీగా వెళ్లిపోతానని చెప్పాడు.

ఇక్కడే ఆదిరెడ్డి ఆ అమ్మాయి బాధపడుతోంది మాట్లాడంటి అంటే నాకు కూడా అలాగే ఉందంటూ మాట్లాడాడు. ఆ తర్వాత కూడా ఆదిరెడ్డితో ఇష్యూ అయ్యింది. మద్యలో ఆది మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి అన్నాడు రేనంత్. నేను హౌస్ మేట్ బ్రో నేను మాట్లాడతా.. నువ్వు పెద్ద సింగర్ అంటావ్, ఇండియన్ ఐడియల్ అంటావ్ ఇట్లా బిహేవ్ చేస్తే ఎలా అంటూ మాట్లాడాడు ఆదిరెడ్డి. దీంతో రేవంత్ బాగా ట్రిగ్గర్ అయిపోయాడు. ఇక ప్రతి హౌస్ మేట్ రేవంత్ కి ఏదో చెప్పడానికి వస్తుంటే ప్లీజ్ నన్ను వదిలేయండి నేను నాలాగే ఉంటాను.

నేను స్కెచ్ గీస్కుని బిగ్ బాస్ చూసి ఇలా ఆడాలి. ఇలా మాట్లాడాలి అని లెక్కలు వేసుకుని రాలేదు అంటూ క్లియర్ గా చెప్పాడు. ఇక్కడే ఆదిరెడ్డితో మాట్లాడేటపుడు నేను సోషల్ మీడియా నుంచీ రాలేదంటూ నోరుజారాడు. హౌస్ మేట్స్ రేవంత్ ని ట్రిగ్గర్ చేసిన ప్రతిసారి మాటలు వదిలేస్తున్నాడు రేవంత్. మరి ఈవారం నాగార్జున క్లాస్ పీకితేనే కానీ సెట్ అయ్యేలా లేడనే చెప్పాలి. అంతేకాదు, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే ఫైనల్ వరకూ ఉండి చుక్కలు చూపిస్తా అంటూ రేవంత్ రెచ్చిపోయాడు. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus