Allu Arjun: అల్లు అర్జున్‌.. ది బెస్ట్‌ యాక్టర్‌… అంత ఈజీగా రాలేదు.. ఆ కష్టం ఇదీ!

  • August 25, 2023 / 12:05 PM IST

‘‘వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడు. 18 ఏళ్ల వయసు వచ్చాక ఈ పది లక్షలు వాడికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయి’’ – ఓ మనవడు గురించి తాత ఆలోచన ఇదీ. ఈ మాటలు ఎవరో చెప్పలేదు, మొన్నీ మధ్యే ఆ మనవడు చెప్పాడు. మనవడి గురించి తాత అలా అనుకున్నారు అంటే.. ఆ మనవడు ఎలా ఉండి ఉండాలి చెప్పండి. ఇక్కడ మనవడు అల్లు అర్జున్‌ అయితే, తాత అల్లు రామలింగయ్య. అల్లు అర్జున్‌ తెలుగు నుండి తొలి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అయిన నేపథ్యంలో ఈ మాటలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌ నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు ప్రకటించారు. ఏముంది ఏటా ఇచ్చేదే అనే మాట అందాం అనుకుంటే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే తెలుగు నుండి మహామహులైన నటులు వచ్చినా ఈ అవార్డు అందుకోలేకపోయారు. నాటి స్టార్‌లు, నేటి సీనియర్‌ స్టార్లు, యువ స్టార్‌ హీరోలు.. ఇలా ఎవరూ ‘నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌’ అవ్వలేకపోయారు. కానీ ఐకాన్‌ స్టార్‌ టర్న్‌డ్‌ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఇది చేసి చూపించాడు. అయితే ఇదేం అంత ఈజీగా రాలేదు.

‘డాడీ’ సినిమాలో అల్లు అర్జున్ చిన్న కేమియో చేశాడు. చురుకుగా డ్యాన్స్‌ చేసే చిరంజీవి శిష్యుడిగా రెండు సీన్స్‌లో కనిపిస్తాడు. అది చూసి మెగా ఫ్యామిలీ హీరో కదా ఆ మాత్రం డ్యాన్స్‌ వచ్చులే అనుకున్నారు. కట్‌చేస్తే కొన్ని రోజులకు ‘గంగోత్రి’లో సింహాద్రిగా హీరో అయిపోయాడు. ఆ సినిమాకు మంచి పేరొచ్చింది. కానీ సింహాద్రికి అదేనండీ బన్నీకి మాత్రం విమర్శలు వచ్చాయి. లుక్‌ విషయంలో, స్టైల్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బన్నీ ఆలోచనలు మారాయి. స్టైల్‌కి తనదైన అర్థం చూపించేలా సినిమాల ఎంపిక ప్రారంభించాడు.

అందులో తొలి ప్రయత్నం ‘ఆర్య’. ఫీల్‌ మై లవ్ అంటూ బన్నీ ఆ సినిమాలో హీరోయిన్‌ వెంటపడతాడు. ఆ క్రమంలో చూపించిన యాటిట్యూడ్‌ కుర్రాళ్లకు నచ్చేసింది. అయినా ఎక్కడో చిన్న వెలితి. అదే లుక్‌, ఫీల్‌. ఆ తర్వాత ‘బన్నీ’, ‘హ్యాపీ’ సినిమాలు చేసినా పెద్దగా మార్పేమీ కనిపించలేదు. కుర్రాడు యాక్టివ్‌గా ఉన్నాడు, మంచిగా నటిస్తున్నాడు అనే మాట తప్ప. అప్పుడే వచ్చింది ‘దేశముదురు’. ప్రతి స్టార్‌ హీరోకు తనదైన బాడీ లాంగ్వేజ్‌, గుర్తింపు ఇస్తారని దర్శకుడు పూరి జగన్నాథ్‌కి పేరు. బన్నీకి కూడా ఆయన అదే చేశారు. బాలగోవిందంగా బన్నీ ఆ సినిమా రప్ఫాడించాడు.

‘పరుగు’లో మళ్లీ సగటు కుర్రాడిలా కనిపించిన బన్నీ… ‘ఆర్య 2’లో టిపికల్‌ క్యారెక్టర్‌ చేశాడు. కాస్త నెగిటివ్‌ టచ్‌ ఉన్న ఈ రోల్‌ బన్నీ ఇరగొట్టాడు. అయితే సినిమా ఫలితం రుచించలేదు. ఆవెంటనే ‘బద్రినాథ్‌’ అంటూ ప్రయోగం చేస్తే భయపెట్టింది. తిరిగి బన్నీ ‘దేశముదురు’ ఫీల్‌లో ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసుగుర్రం’ చూపించాయి. వీటిలో లుక్‌, ఫీల్‌ అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే నటుడిగా బన్నీని మరో లెవల్‌లో చూపించిన సినిమా మాత్రం ‘ఇద్దరమ్మాయిలతో’నే. కానీ ఆ సినిమా ఫలితమూ తేడా కొట్టింది.

‘ఎవడు’ సినిమాలో కనిపించింది కాసేపైనా.. కొత్త బన్నీని చూస్తాం. సత్యగా బన్నీ చాలా కూల్‌గా, క్లాస్‌గా కనిపించి మెప్పించాడు. ఆ స్టైల్‌ బన్నీకి బాగుంది అనిపించింది. కానీ ఎక్కువ సేపు లేకపోయేసరికి చిన్న వెలితి. కానీ ఇంచుమించు అదే ఫీల్‌లో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చేశాడు. అందులో తండ్రిని అమితంగా ప్రేమించి, తండ్రికి చెడ్డ పేరు రాకుండా, కుటుంబానికి అడ్డంగా ఉండే కొడుగ్గా భలే నటించాడు. ఇక ‘గోన గన్నారెడ్డి’గా ‘రుద్రమదేవి’లో బన్నీ చూపించిన నట విశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ వెంటనే ‘సరైనోడు’ అంటూ ఫుల్‌ మాస్‌ సినిమా చేశాడు బన్నీ. అందులో కొత్తదనం లేకపోయినా.. బన్నీ లుక్‌లో మాత్రం కనిపిస్తుంది. ఆ వెంటనే ‘డీజే’ చేసి స్టైల్‌ని మరింత పెంచుకున్నాడు. అందులో డీజే లుక్‌లో అయితే బన్నీ స్క్రీన్‌ ప్రజెన్స్‌ అదిరిపోతుంది. ఆ వెంటనే మరో ప్రయోగం చేశాడు. అదే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమా బన్నీకి పెద్ద దెబ్బ. దీంతో కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకొని ‘అల వైకుంఠపురములో’ చేశాడు. అందులో బంటుగా బన్నీ ఇరగ్గొట్టేశాడు. బన్నీకి అలవాటైన దర్శకుడు, పాత్ర కావడం వీరంగం చేశాడు.

ఇక్కడి వరకు బన్నీ (Allu Arjun) ఎన్ని ప్రయోగాలు చేసినా తేడా కొట్టేశాయి. సగటు కుర్రాడిలా, అల్లర చేసే అబ్బాయిలా కనిపిస్తేనే జనాలు మెచ్చారు. కానీ అక్కడితో ఆగే రకం కాదు బన్నీ. తనకు ఇబ్బందులు పెట్టిన ప్రయోగాన్నే మళ్లీ నమ్ముకున్నాడు. ఈ సారి తనను బాగా నమ్మే సుకుమార్‌తో సినిమా ప్రారంభించాడు. అదే ‘పుష్ప: ది రైజ్‌’. సినిమా లుక్‌లు, వీడియోలు అదిరిపోయాయి. సినిమా వచ్చేసరికి మేనరిజమ్స్‌, డైలాగ్స్‌, యాటిట్యూడ్‌ అన్నీ భేష్‌ అనిపించుకున్నాయి. ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ ఓ భుజాన్ని పైకెత్తి డైలాగ్‌ చెప్పినా.. గంటల తరబడి మేకప్‌ వేసుకొని సినిమా చేసినా, కిలో మీటర్లు అడవిలో నడిచి షూటింగ్‌ చేసినా అంతా సినిమా కోసమే.

ఇప్పుడు ఆ కష్టమే తెలుగు నుండి తొలి జాతీయ ఉత్తమ నటుడిగా బన్నీని నిలబెట్టింది. దీని కోసం బన్నీ ఏం చేశాడు అంటే.. సినిమానే నమ్ముకున్నాడు, మాటలు పడ్డాడు, ఒక్కోసారి కొన్ని మాటలు కష్టంగా అనిపిస్తే పంటి బిగువున కోపం అణచుకున్నాడు. ఫ్లాప్‌లు వస్తే మరోసారి ప్రయత్నిద్దాం అనుకున్నాడు. అంతేకానీ ప్రయోగాలు ఆపలేదు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం మానేయలేదు. ఇప్పుడు అదే అతనిని స్టార్‌ హీరోను చేసింది. ఇప్పుడు బెస్ట్‌ యాక్టర్‌ను చేసింది. ఇది అవార్డు అనుకుంటే బన్నీ ఇక్కడే ఉండిపోతాడు. అదే బాధ్యత అనుకుంటే మరిన్ని సంపాదిస్తాడు. బన్నీ గురించి తెలిసినవాళ్లు బన్నీ రెండో విధానాన్నే ఎంచుకుంటాడు అంటారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus