ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. 2016 లో వచ్చిన ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva)..ల సూపర్ హిట్ మూవీ ‘జనతా గ్యారేజ్’ తో (Janatha Garage) టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనుష్క (Anushka Shetty) నటించిన ‘భాగమతి’ (Bhaagamathie), రవితేజ (Ravi Teja) నటించిన ‘ఖిలాడి’ (Khiladi) , సమంత (Samantha Ruth Prabhu) నటించిన ‘యశోద’ (Yashoda) వంటి సినిమాల్లో నటించి ఇక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’ (Marco) డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Marco
మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే కన్నడ వంటి భాషల్లో కూడా డబ్ అయ్యి అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటివరకు రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి.. 2024 లో మలయాళంలో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేసి ఈరోజు అనగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇక్కడ మాత్రం ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది. ‘మార్కో’ లో కొత్తదనం ఏమీ లేదని… రెగ్యులర్ కథనే భయంకరమైన వయొలెన్స్ తో నింపేశారని తెలుగు ప్రేక్షకులు చెబుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్, విలన్ తండ్రిని బాంబ్ పెట్టి పేల్చే సీన్, క్లైమాక్స్ లో హీరో ఫ్యామిలీ ఉండే ఇంటిపై విలన్ గ్యాంగ్ చేసే దాడి సీన్.. చాలా అంటే చాలా భయంకరంగా వెంటనే కళ్ళు మూసుకునే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు.
ముఖ్యంగా హీరో ఇంటి పై విలన్ గ్యాంగ్ దాడి చేసే సీన్లో గ్యాస్ సిలిండర్ తో చిన్నపిల్లాడి మొహం పై విలన్ కొట్టి కొట్టి చంపడం, ఆడవాళ్ళ బుగ్గలని చీల్చేయడం, గర్భంతో ఉన్న అమ్మాయి పొట్ట పై కొట్టి.. శిశువుని బలవంతంగా బయటకు లాగేయడం.. అబ్బో ఇలాంటి ఘోరమైన సీన్లు సినిమాలో చాలా ఉన్నాయి. అసలు ఇలాంటి ఘోరమైన సన్నివేశాలకి మన సెన్సార్ వాళ్ళు ఎలా అనుమతి ఇచ్చారు అంటూ సినిమా చూసిన వాళ్ళు విమర్శిస్తున్నారు.