Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ కొట్టిన వెంకటేష్ సినిమా ఏదంటే..?

(Chiranjeevi)  సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక నిర్మాత, దర్శకుడ కథ ఫైనల్ చేసుకుని.. దానికి తగ్గ హీరో కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు.. అలా కొంతమంది హీరోలను ఆప్షన్‌గా పెట్టుకుని.. కథానాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు.. కాంబినేషన్ సెట్ అయ్యేవరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. కొన్ని సార్లు సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆగిపోయిన సంఘటనలు చాలానే జరిగాయి.. అలా విక్టరీ వెంకటేష్ చేయాల్సిన ఓ సినిమా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ కొట్టారు..

ఆ ప్రాజెక్ట్ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ హీరోగా, రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడిగా పరిచయమవుతూ ‘మున్నాభాయ్ MBBS’ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.. కొంత గ్యాప్ తర్వాత సంజయ్‌కి సాలిడ్ సినిమా పడింది.. తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’, సంజూ బాబా బయోపిక్ ‘సంజు’ కూడా తీశారు హిరాణీ.. ఇక ‘3 ఇడియట్స్’, ‘పీకే’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోని పెట్టి మున్నాభాయ్ వంటి ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తీసి బాలీవుడ్‌ని ఆకర్షించారాయన.. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని కొంతమంది నిర్మాతలు రైట్స్ కోసం పోటీ పడ్డారు.. భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఫ్యాన్సీ రేటుకి ఆల్ ఇండియన్ రైట్స్ సొంతం చేసుకున్నారు.. తమ్ముడు వెంకటేష్ హీరోగా.. తన ఇమేజ్‌, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయించి తెలుగులో రీమేక్ చేయాలనేది సురేష్ బాబు ఆలోచన..

దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు.. కట్ చేస్తే ఏమైందో ఏమో కానీ.. మున్నాభాయ్ తెలుగు రీమేక్ హీరో, ప్రొడ్యూసర్ ఇద్దరూ మారిపోయారు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో ‘శంకర్ దాదా MBBS’ పేరుతో తెరకెక్కించగా సూపర్ హిట్ అయ్యింది.. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు, కామెడీ సీన్స్ ఇప్పటికీ అలరిస్తుంటాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus