బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ రెండోవారం కూడా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. రాత్రి 9గంటలకి స్ట్రీమింగ్ ఎపిసోడ్ ని కొంతమంది చూస్తున్నారే కానీ, లైవ్ విషయానికి వచ్చేసరికి వ్యూవర్స్ సంఖ్య చాలా బాగా తగ్గిపోయింది. మొదటి వారంతో పోలిస్తే రెండోవారం దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రాబోతున్న ఐపియల్ సీజన్ బిగ్ బాస్ నిర్వాహకులకి చమటలు పట్టిస్తోంది. ఇప్పటికే కోట్లు ఖర్చుపెట్టి మరీ సెట్ వేసి ఈషో ని రన్ చేస్తున్నారు.
అంతేకాదు, ఓటీటికి కూడా నాగార్జుననే హోస్టింగ్ గా ఉంచారు. హౌస్ మేట్స్ ని కూడా చాలామంది సీనియర్స్ ని ఎక్కువ రేటు ఇచ్చి మరీ హౌస్ లోకి పంపారు. దీంతో బడ్జెట్ కోట్లు దాటేసింది. ఇప్పుడు మార్చి ఎండింగ్ నుంచీ ఐపియల్ స్టార్ట్ అయితే లైవ్ స్ట్రీమింగ్ చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, డిస్నీ హాట్ స్టార్ లో ఒక యూజర్ ఒక లైవ్ స్ట్రీమింగ్ లేదా, ఒక ప్రైమ్ వీడియో మాత్రమే చూడగలడు.
ఇలాంటి సమయంలో ఐపియల్ లైవ్ చూసేటపుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ చూడటం అసాధ్యం. ఇప్పుడు యూత్ ని టార్గెట్ చేసి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ షోని రన్ చేస్తున్నారు. అందుకే హౌస్ లో బోల్డ్ బ్యూటీస్ చాలామందే ఉన్నారు. కానీ, ఐపియల్ ప్రారంభం అయితే మాత్రం బిగ్ బాస్ నాన్ స్టాప్ కి కనీసం వ్యూవర్ షిప్ కూడా రాదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ 9 గంటలకి ప్రసారం చేసే ఎపిసోడ్స్ కూడా అప్పటికప్పుడు చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది.
ఎందుకంటే, ఐపియల్ మ్యాచ్ లు ఈ 9గంటల టైమ్ కి మంచి రసపట్టులో ఉంటాయి. అంతేకాదు, ఈసారి ఐపియల్ ని చాలా గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు. రెండు టీమ్స్ పెరిగాయి కూడా. కాబట్టి, ఐపియల్ వ్యూవర్స్ బిగ్ బాస్ చూడంటం అనేది జరగని పని. దీనికి ఇంకో కారమం ఏంటంటే మొబైల్ డేట్. ఐపియల్ చూసిన తర్వాత యూజర్స్ డేటా అనేది ఆల్ మేస్ట్ అయిపోతుంది. ఇక బిగ్ బాస్ చూసేందుకు ఎక్స్ ట్రా డేటా వేసుకోవడానికి ఇష్టపడతారా లేదా అనేది ఆసక్తికరం.
ఈ చిన్న లాజిక్ ని బిగ్ బాస్ టీమ్ ఎందుకు మర్చిపోయారు ? ముందుగానే ప్లాన్ చేసుకోలేదా అని బిగ్ బాస్ లవర్స్ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పట్నుంచైనా ప్రైమ్ టైమ్ లో టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తే దీన్ని అధిగమించే అవకాశం ఉందని సలహాలు ఇస్తున్నారు. అదీ మేటర్.