రష్మిక మందన… టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న స్టార్ హీరోయిన్. 2018 వ సంవత్సరంలో ఛలో చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… ఆ తరువాత గీత గోవిందం, సరిలేరు నీకేవ్వరు.. వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ,తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటుంది ఈ బ్యూటీ.
ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 3ఏళ్ళ లోనే ఈమె క్రేజ్ ఇలా ఉంది కదా .. అందులోనూ కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది. ఈ లెక్కన రష్మిక.. ఎంత సంపాదించి ఉంటుంది అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక.. ఈ నాలుగేళ్లలో రూ.28కోట్ల వరకూ సంపాదించింది అని తెలుస్తుంది.2016 లో రష్మిక సంపాదన 3 కోట్లు కాగా…2017 లో అది 7 కోట్లు అయ్యిందట.
ఇక 2018లో 13 కోట్లు కాగా.. 2019 లో 19కోట్ల వరకూ పెరిగినట్టు తెలుస్తుంది. 2020 కి వచ్చేసరికి అది 28కోట్ల వరకూ పెరిగింది. రష్మిక తండ్రి కూడా బడా బిజినెస్ మెన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె సంపాదన మొత్తం.. తన తండ్రి బిజినెస్ లలో ఇన్వెష్ట్ చేస్తుందని టాక్.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!