Sikandar: నీ సినిమాల ఎంపికకు నువ్వే బాధ్యురాలివి.. హీరోను చూసి ఓకే చేస్తే ఎలా?

‘పుష్ప’ (Pushpa) సినిమాలు పూర్తిగా కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఉన్నాయి.. అయితేనేం హీరోయిన్‌ పాత్రకు చాలా విలువుంది. ఇక ‘ఛావా’ (Chhaava)  సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె పాత్రకు మంచి వెయిటే ఇచ్చారు. ఇలాంటి సినిమాలు చేసిన రష్మిక (Rashmika Mandanna) కథల ఎంపిక మీద ఎవరికీ డౌట్‌ రాదు. కానీ ‘సికందర్‌’ (Sikandar) సినిమా చూశాక ఏంటీ రష్మిక ఇలాంటి సినిమాలో చేసిందా? అని అనిపించక మానదు. దానికి తోడు ఇలాంటి పాత్ర నాకు మళ్లీ రాదు అనే యాంగిల్‌ ఆమె చెప్పడం చూసి ఏంటిలా చేసింది అనిపిస్తోంది.

Sikandar

‘సికందర్‌’ సినిమా అందరూ చూసి ఉంటారు అని అనుకోలేం. ఎందుకంటే ఆ సినిమా హీరో సల్మాన్‌ ఖాన్‌ను Salman Khan) నెత్తినెట్టుకునే బాలీవుడ్‌ జనాలే ఆ సినిమా విషయంలో ముఖం చాటేస్తున్నారు. అలాంటిది మనం ఎందుకు చూస్తాం చెప్పండి. ఒకవేళ రష్మిక కోసం వెళ్తారు అనుకుంటే.. ఆమె సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపిస్తుంది అనే విషయం తెలిసి ఆగిపోయి ఉంటారు.

ఈ నేపథ్యంలో అసలు ఈ బిట్లు బిట్లు పాత్రను రష్మిక ఎలా, ఎందుకు ఓకే చేసింది అనేది అర్థం కావడం లేదు. బిట్లు బిట్లు అంటే సుమారు 30 నుండి 40 నిమిషాలు అక్కడక్కడ కనిపిస్తుంది మరి. పోనీ కనిపించినంత సేపు ఏమన్నా ఆమె పాత్రకు విలువ ఉంటుందా అంటే.. అంటే లేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఆ పాత్ర చనిపోవడమే సినిమాలో కీలకమైన పాయింట్‌.

అది కూడా సినిమా ప్రారంభంలోనే ఆమె పాత్రను ముగించేశారు దర్శకుడు మురుగదాస్‌ (A.R. Murugadoss) . ఇదంతా చూస్తుంటే సల్మాన్‌ ఖాన్‌ సినిమా అని చెప్పగానే రష్మిక ఒప్పేసుకుంది అని అనిపిస్తోంది. లేదంటే ముందు నిడివి ఉన్న, ముఖ్యమైన పాత్ర అని చెప్పి తర్వాత కత్తేరేశారేమో. ఏదేమైనా ఆమెకు ఈ డిజాస్టర్‌ పెద్ద ఎదురుదెబ్బే. తన సినిమాల నిర్ణయం విషయం మొత్తం పాత్ర తనదే అని మొన్నీమధ్య చెప్పింది.

‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడట.. ఇప్పుడు రావడం ఓకేనా? రిస్కా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus