తమ సినిమా ఒకటి వచ్చి దారుణమైన ఫలితం వచ్చినప్పుడు హీరోలు ఎవరైనా.. కొత్త సినిమాను స్టార్ట్ చేయడానికి, రెడీగా ఉంటే రిలీజ్ చేయడానికి కాస్త ఆలోచిస్తారు. ఆ సినిమా వైబ్‌లో ఈ సినిమాను చూసి ఫీలై ఫలితం విషయంలో ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ నితిన్ (Nithiin) ఈ విషయంలో డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రెడీగా ఉన్న తన సినిమాను మరో నెలలోనే రిలీజ్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నారట. రెండ్రోజుల్లో అనౌన్స్‌మెంట్ ఉంటుందట.
‘రాబిన్ హుడ్’ (Robinhood) అంటూ భారీ బడ్జెట్, అతి భారీ ప్రచారంతో ఇటీవల వచ్చాడు నితిన్. బాక్సఫీసు దగ్గర ఈ సినిమా అంతకుమించిన దారుణమైన ఫలితం చవి చూసింది. దీంతో రెడీగానే ‘తమ్ముడు’ (Thammudu) సినిమాను ఎప్పుడు తీసుకొస్తారు అనే ప్రశ్న వినిపించింది. సమ్మర్‌లో కాకుండా దసరా సీజన్‌కు తెస్తే ఈ లోపు డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు అని అనుకున్నారు అంటూ ఓ పుకారు బయటకు వచ్చింది.
కట్ చేస్తే ఇప్పుడు సినిమాను మే9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని కొత్త వార్త ఒకటి బయటికొచ్చింది. నితిన్ – సప్తమి గౌడ్ (Sapthami Gowda) కాంబినేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమా తర్వాత వేణు శ్రీరామ్ (Venu Sriram) ఈ సినిమాను తెరకెక్కించారు. సీనియర్ హీరోయిన్ లయ (Laya) ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు.
అక్కా తమ్ముడి బంధం నేపథ్యంలో ఈ ‘తమ్ముడు’ సినిమా తెరకెక్కింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం దిల్ రాజు (Dil Raju) ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు అనే మాట కూడా సినిమా వర్గాల నుండి బయటకు వచ్చింది. అంటే సినిమాకు ఖర్చు భారీగానే అయింది. మరి ‘రాబిన్ హుడ్’ ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాను తీసుకురావడం ఎంతవరకు కరెక్టో?