HIT 2 Movie: ‘హిట్2’ సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా?

అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్2’. 2022 డిసెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఈ మూవీతో అడివి శేష్ తో వరుసగా 6వ హిట్ ను అందుకున్నాడు. నిజానికి కథగా చెప్పుకుంటే ‘హిట్2’ ఏమి ఉండదు. ‘హిట్’ లో మిస్సింగ్ కేసు గురించి దర్యాప్తు జరిగినట్టు చూపించారు. ఈ సినిమాలో మర్డర్ మిస్టరీ గురించి దర్యాప్తు జరుగుతుంది.

‘హిట్2’ లో ఓ సైకో అమ్మాయిలను చంపుతూ … వాళ్ళ శరీరాన్ని ముక్కలు ముక్కలు కోసేసి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. చాలా మంది అమ్మాయిలను చంపేసి కృష్ణ దేవ్ అలియాస్ కేడికి సవాలు విసురుతూ ఉంటాడు. ఆ సైకో ఎవరు అన్నది సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది కాబట్టి చెప్పేసినా ప్రాబ్లమ్ ఉండదు. కానీ చూడని వాళ్ళు ఉండి.. సినిమాని చూద్దాం అనుకుంటే.. అనవసరంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ను చెడగొట్టినట్టు ఉంటుంది కాబట్టి..

ఇప్పటికీ రివీల్ చేయకుండా మేటర్ లోకి వెళ్ళిపోదాం. కృష్ణ దేవ్ కు ఆ సైకో.. ఓ అమ్మాయిని చంపేస్తాను అంటూ ఫోటో పంపేస్తాడు. అప్పుడు కేడి కంగారుగా ఆ అమ్మాయి వద్దకు వెళ్తాడు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది. అయితే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే విలన్. కానీ హీరో వెళ్లే సరికి అతను ఇంట్లోనే ఉంటాడు. కానీ హీరో బయటకు రాగానే అతని పోలీస్ జీప్ పై హీరోయిన్ ఫోటో పెట్టి ఆమెను చంపేస్తాను అని రాసి పెట్టి ఉంటుంది.

ఇక్కడే డైరెక్టర్ మిస్టేక్ చేశాడు అని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసిన ప్రేక్షకులు అంటున్నారు. అదేంటి అంటే.. విలన్ లోపలే ఉన్నప్పుడు ఆ ఫోటో హీరో పోలీస్ జీప్ పై ఎవరు పెడతారు. ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు పెట్టుకుంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus