విశ్వక్ సేన్..’ఈ నగరానికి ఏమైంది?’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఇంకా ప్రయత్నం చేయడం ఏంటి? అతనికి క్రేజ్ లేదా? అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. అతనికి క్రేజ్ ఉంది.. కానీ అతని సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సందర్భాలు అయితే లేవు. ముఖ్యంగా థియేట్రికల్ బిజినెస్ పరంగా చేసుకుంటే ఎంతో కొంత నష్టాలు మిగులుస్తూనే ఉన్నాయి అతని సినిమాలు.
అన్నీ పక్కన పెడితే సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఓ సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. అయితే షూటింగ్ మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్న టైంలో విశ్వక్ సేన్ వల్ల డిలే అవుతూ వస్తుంది అని, అతని వల్ల ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు అని, గంటకు ముందు షూటింగ్ కు రాలేను అని మెసేజ్ పెడతాడని, డెడికేషన్, డిసిప్లిన్ లేని నటుడు అతను అంటూ అర్జున్ ఓ ప్రెస్ మీట్ పెట్టి అతని గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసేలా చేశాడు.
అయితే ‘నేను ఎటువంటి మార్పులు చెప్పినా అర్జున్ సార్ తీసుకోవడం లేదు అని, నేను చెప్పిందే వినాలి అని చెప్పి తన మాటకు విలువ ఇవ్వడం లేదు’ అంటూ విశ్వక్ తెలియజేశాడు. విశ్వక్ చెప్పింది కరెక్టే..! కానీ విశ్వక్ పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఓ దర్శకుడు చెప్పిన కథకి హీరో ఒప్పుకున్నప్పుడు.. ప్రాజెక్టు సైన్ చేసినప్పుడు.. అది పూర్తి చేయాల్సిన బాధ్యత అతనిదే.
పారితోషికం విషయంలో ఏమైనా లోటుపాట్లు చేస్తే అది దర్శకుడి తప్పు అనొచ్చు. పోనీ విశ్వక్ ఏమైనా అన్నీ బ్లాక్ బస్టర్లు ఇచ్చాడా అంటే.. ? దానికి సమాధానం అందరికీ తెలుసు. అయినా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెట్టడం పెద్ద తప్పు. దర్శకుడి కథ అన్నప్పుడు అతనికి ఓ వ్యూ ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రాజెక్ట్ కి సైన్ చేసే ముందే ఆలోచించాలి కానీ సైన్ చేసి,అందరి కాల్ షీట్లు ఓకే అయ్యాక షూటింగ్ ఆపడం అనేది వంద శాతం విశ్వక్ సేన్ తప్పే అని చెప్పాలి.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!